చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న మురుగ‌దాస్ ఫ్యామిలీ పిక్‌

Thu,December 7, 2017 08:37 AM
a r murugadoss family pic superb

ఎ.ఆర్ మురుగదాస్‌.. ఇటు తెలుగు అటు త‌మిళ ప్రేక్షకుల‌కి ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. తెలుగులో జ‌ర్నీ, గ‌జినీ, స్టాలిన్ వంటి సినిమాల‌తో అల‌రించిన మురుగ త‌మిళంలో విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించాడు. ఇవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. హిందీలోను స్టార్ హీరోల‌తోను సినిమాలు తెర‌కెక్కించిన ఘ‌న‌త మురుగ‌దాస్‌కి ఉంది. రీసెంట్‌గా స్పైడ‌ర్ చిత్రాన్ని తెరకెక్కించిన మురుగ‌దాస్ ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాడు. ఇక త్వ‌ర‌లో విజ‌య్ 62వ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్నాడు.స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం భారీ బ‌డ్జెట్ మూవీగా ఉంటుంద‌ని స‌మాచారం. అయితే తాజాగా మురుగ‌దాస్ ఫ్యామిలీకి సంబంధించిన ఓ పిక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ముచ్చ‌ట‌గొలుపుతున్న మురుగదాస్ ఫ్యామిలీ పిక్‌పై ఏ ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అయితే ఇందులో మురుగ‌దాస్ త‌న‌యుడు చేతికి క‌ట్టు వేసుకొని ఉండ‌డం అభిమానుల‌లో కాస్త ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఈ పిక్ ఎప్ప‌టిదో కాని అభిమానుల‌ని మాత్రం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

1840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS