ప్లీజ్.. మా సల్మాన్‌ను పెళ్లి చేసుకోవా!

Mon,February 18, 2019 04:10 PM
A fan asked Katrina Kaif to marry Salman Khan

ఐదు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు పేరుంది. పాలిటిక్స్‌లో రాహుల్‌గాంధీ.. సినిమాల్లో సల్మాన్‌ఖాన్ పెళ్లి విషయంలో జరిగినంత చర్చ ఎవరిపైనా జరగలేదు. ఎప్పటికైనా తమ అభిమాన హీరో పెళ్లి చేసుకోకపోతాడా అని అటు సల్మాన్ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని నేరుగా అతని పెళ్లి గురించి అడిగేశాడు. అయితే అతడు అడిగింది సల్మాన్‌ను కాదు. హీరోయిన్ కత్రినా కైఫ్‌ని. కత్రినా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ఓ అభిమాని కామెంట్ చేస్తూ.. మా సల్మాన్‌ను పెళ్లి చేసుకోవా కత్రినా ప్లీజ్ అని అడిగాడు. ఇదే విషయాన్ని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కత్రినాను అడిగితే.. హ్మ్ అంటూ ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అంతేకాదు తన పెళ్లిపై ఇంకాస్త ఓపెన్ అయింది. నాకు నిజంగా తెలియదు. పెళ్లి అంటే ఇద్దరికి సంబంధించిన విషయం. ఇద్దరి మనసులు కలవాలి. అలాంటి వ్యక్తి కలిస్తే అప్పుడు చేసుకుంటా అని కత్రినా చెప్పడం విశేషం. కత్రినా, సల్మాన్ ఐదేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2009లో వీళ్లు విడిపోయారు. అయితే ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య మంచి స్నేహమే కొనసాగుతున్నది. ఒకరినొకరు ఫ్యామిలీగా చెప్పుకుంటారు. ఈ మధ్యే టైగర్ జిందా హైలో కలిసి నటించారు. మరోసారి భారత్ మూవీ కోసం జత కట్టారు.

3637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles