న‌టి ఇంట్లో వ‌స్తువులు మొత్తం ఊడ్చేసిన దొంగ‌లు

Fri,February 23, 2018 01:40 PM
a couple cheated to meghana naidu

కలియోన్‌ కా చమన్‌ మ్యూజిక్‌ రీమిక్స్‌ ఆల్బమ్‌(2002)తో పాపులర్‌ అయిన న‌టి మేఘనా. తెలుగులో పృథ్వీ నారాయణ, విక్రమార్కుడు, పాండురంగడు, పిల్ల జమీందార్‌ తదితర చిత్రాల్లో న‌టించి అల‌రించింది ఈ అమ్మ‌డు. అయితే రీసెంట్‌గా మేఘ‌నా ఇంట్లో అద్దెకుంటున్న ఓ జంట ఆమెని న‌మ్మించి లోదుస్తుల‌తో సహా అన్ని సామాన్ల‌తో ఉడాయించారట‌. ఈ విష‌యాన్ని మేఘ‌నా త‌న ఫేస్ బుక్ ద్వారా తెలియ‌జేస్తూ, వారు ఎక్క‌డ ఉన్నా కూడా స‌మాచారం ఇవ్వాల‌ని కోరింది. వివ‌రాల‌లోకి వెళితే త‌న‌కి గోవాలో ఓ ఇల్లు ఉంది. దానికి గార్డియ‌న్‌ని నియ‌మించి అప్పుడ‌ప్పుడు వెళ్ళి అద్దె వ‌సూలు చేసుకుంటుంది. రీసెంట్‌గా ఓ జంట త‌మ‌ది ముంబై అని, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉంటామని పనిపై గోవా వచ్చామంటూ తమకు ఇళ్లు అద్దెకు కావాలంటూ మేఘనా నాయుడు ఇంట్లో మకాం పెట్టేశారు. కొన్ని రోజులు అద్దె చెల్లించిన వారు త‌రువాత చెల్లించ‌క‌పోయే స‌రికి ఆదార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంద‌ట మేఘ‌నా గార్డియ‌న్‌. ఇక ప‌రిస్థితి చేయి దాటుంద‌ని తెలుసుకున్న ఈ జంట రాత్రికి సామాను మొత్తంవ స‌ర్ధుకొని జంప్ అయ్యార‌ట. ఓ రూంలో మేఘ‌నాకి సంబంధించిన వ‌స్తువుల‌తో పాటు లో దుస్తులు, సాక్సులు కూడా ఉన్నాయ‌ట‌. వాటిని కూడా వ‌ద‌ల‌కుండా చెక్కేశార‌ట‌. అయితే ఆ జంట ఇచ్చిన ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఫేక్ అని తెలిసి మొత్తుకుంటుంది మేఘ‌నా. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమంటే మేఘానా ఇంటికి గార్డియ‌న్‌గా ఉంటున్న వ్య‌క్తికి మాయ‌మాట‌లు చెప్పి 85 వేలు వ‌సూలు చేశారు. గార్డియ‌న్ కొడుక్కి న్యూజిలాండ్‌లో జాబ్ ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి మోసం చేసింది ఆ జంట‌. ఇరుగు పొరుగు వారి ద‌గ్గ‌ర కూడా అప్పులు చేసిన‌ట్టు తెలుస్తుంది.

3174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS