ఎఫ్2 నుండి 'ఎంతో ఫ‌న్' వీడియో సాంగ్

Sun,January 6, 2019 08:31 AM

విక్టరీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్’ అనేది ట్యాగ్‌లైన్‌. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు. సంక్రాంతికి(జ‌న‌వ‌రి 12న‌) విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. తాజాగా శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఎంతో ఫ‌న్ అనే లిరిక‌ల్ సాంగ్ వీడియోని విడుద‌ల చేశారు. ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. వెంకీ, త‌మ‌న్నా కెమిస్ట్రీ బాగుంద‌ని చెబుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఫ‌న్ రైడర్‌ను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించారు.


5060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles