థీమ్ పార్టీ జ‌రుపుకున్న 80వ ద‌శకం నాటి తార‌లు

Fri,November 16, 2018 08:09 AM
9th time south stars reunion in particular place

ప్ర‌తి ఏడాది ఏదో ఒక ప్లేస్‌లో 80వ దశకం నాటి తార‌లు అంద‌రు క‌లిసి థీమ్ పార్టీ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది మ‌హాబ‌లిపురం వ‌ద్ద స‌ముద్ర‌తీరంలో క‌లుసుకున్న స్టార్స్ ఈ సారి వేరే చోట క‌లిసారు. 80వ సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో జరిగిన ఈ వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమకి చెందిన స్టార్స్ అందరు పాల్గొన్నారు. గ‌త ఏడాది ఈ పార్టీలో చిరంజీవి, వెంక‌టేష్‌లు క‌నిపించ‌గా ఈ సారి వారు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న గైర్హాజ‌రు అయిన‌ట్టు తెలుస్తుంది. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ త‌న ట్విట్ట‌ర్‌లో సౌత్ స్టార్స్‌తో క‌లిసి దిగిన ఫోటోస్‌ని షేర్ చేస్తూ .. 9వ రీయూనియ‌న్‌లో 80వ ద‌శ‌కం నాటి తార‌లంద‌రం క‌లిసాము. అంద‌రితో టైం చాలా స‌ర‌దాగా గ‌డిచింది అని అన్నారు .మోహ‌న్ లాల్‌, జాకీష్రాఫ్‌, సుమ‌న్‌, ఖుష్బూ, సుమ‌న్‌, శ‌ర‌త్ కుమార్, అర్జున్‌, భాను చంద‌ర్ త‌దిత‌రులు రీయూనియ‌న్ పార్టీలో క‌ల‌సి సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం వీరి పార్టీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.1582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles