క‌న్న‌డ‌లో మంచి విజ‌యం సాధించిన 99

Thu,May 2, 2019 01:23 PM
99 Movie gets huge response

విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన త‌మిళ చిత్రం 96. ఫ్రెష్ కంటెంట్‌తో, న‌టీన‌టుల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఈ చిత్రం 2018 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ప‌లు భాష‌ల‌లో రీమేక్ అవుతుంది. 96 చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా ఇందులో శ‌ర్వానంద్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇక కన్న‌డ‌లోను 96 చిత్రం రీమేక్ కాగా, 99 అనే టైటిల్‌తో చిత్రం రూపొందింది. మ‌ల‌యాళ న‌టి భావ‌న త్రిష పాత్ర‌లో న‌టించ‌గా, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో గ‌ణేష్ మెరిసాడు . రాము ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థ క‌న్న‌డ వ‌ర్షెన్‌కి సంబంధించిన రైట్స్‌ని చేజిక్కించుకోగా, ప్రీత‌మ్ గుబ్బి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూర్చారు. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ప్ర‌స్తుతం పాజిటివ్ రివ్యూస్ తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. కోలీవుడ్ , శాండల్ వుడ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం టాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

2269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles