ఆకట్టుకుంటున్న 96 ట్రైలర్

Fri,August 24, 2018 06:00 PM
96 Trailer released

విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 96. త్రిష 59వ చిత్రంగా వస్తోన్న 96 మూవీపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు కారణం ఈ చిత్రం 1996వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కి ఉండొచ్చనే టాక్ రావడమే. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నంద గోపాల్ నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రంలో త్రిష స్కూల్ టీచర్ పాత్ర చేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కిన విడుదల విషయంలో కాస్త లేట్ అవుతుంది. సెప్టెంబర్ 13న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అభిమానులని అలరిస్తుంది. విజయ్ సేతుపతి, త్రిషల చిన్నతనం సీన్స్ తో పాటు వారు ఎదిగిన తర్వాత ఇద్దరు ఒక్కటిగా ఎలా అయ్యారు అనేది ట్రైలర్ లో చూపించారు. త్రిష నటిస్తున్న మరో చిత్రం గర్జానై . 2015లో ఎన్ హెచ్ 10 అనే హిందీ మూవీ రీమేక్ గా రూపొందుతుంది. సుందర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, వంశీ కృష్ణ, అమిత్ భార్గవ్, శ్రీ రంజని, వడివుక్కరసి, మధురై ముత్తు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

4214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles