కెన్యాలో శ‌ర్వానంద్‌- స‌మంత సంద‌డి

Tue,April 30, 2019 10:36 AM
96 Telugu remake Kenya schedule commences

గ‌త‌ ఏడాది త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన 96 చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా, రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌లో 34వ చిత్రంగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మంత ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు స‌మాచారం. ఇటీవ‌ల మారిటియ‌స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శ‌నివారం నుండి కెన్యాలో కీల‌క షెడ్యూల్ జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఆ త‌ర్వాత వైజాగ్‌, హైద‌రాబాద్‌ల‌లో కూడా చిత్రానికి సంబంధించి కొంత షూటింగ్ జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. శ‌ర్వానంద్ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో కనిపించ‌నుండ‌గా, ఆయ‌న గార్ల్‌ఫ్రెండ్ పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంది. త‌మిళ చిత్రం 96లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.

1737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles