విజ‌య్ సేతుప‌తి, త్రిష '96' టీజ‌ర్ విడుద‌ల‌

Fri,July 13, 2018 09:38 AM
96 movie teaser released

విజ‌య్ సేతుప‌తి, త్రిష కాంబినేష‌న్‌లో ప్రేమ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం 96. త్రిష 59వ చిత్రంగా వస్తోన్న 96 మూవీపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు కారణం ఈ చిత్రం 1996వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కి ఉండొచ్చనే టాక్ రావడమే. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నంద గోపాల్ నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రంలో స్కూల్ టీచ‌ర్ పాత్ర చేస్తుంద‌ని చెబుతున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప‌ట్టాలెక్కిన విడుద‌ల విష‌యంలో కాస్త లేట్ అవుతుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. త్రిష న‌టిస్తున్న మ‌రో చిత్రం గర్జానై . 2015లో ఎన్ హెచ్ 10 అనే హిందీ మూవీ రీమేక్ గా రూపొందుతుంది. సుందర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, వంశీ కృష్ణ, అమిత్ భార్గవ్, శ్రీ రంజని, వడివుక్కరసి, మధురై ముత్తు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

1273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS