త్రిష మూవీ రీమేక్‌లో స‌మంత‌!

Sat,September 29, 2018 11:18 AM
96 movie remake in telugu

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన త‌మిళ చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానుంది. ఇందులో విజ‌య్ సేతుప‌తి ఫోటోగ్రాఫ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌ల దిల్ రాజు చెన్నై వెళ్ళి మూవీ స్పెష‌ల్ స్క్రీనింగ్ చూశాడ‌ని ఇది ఆయ‌న‌కి న‌చ్చ‌డంతో రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్నాడ‌ని వార్తలు వ‌చ్చాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. 96చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాం. త్వరలోనే ఈచిత్రం లో నటించే నటీనటులను అలాగే సాంకేతిక నిపుణలను అధికారికంగా ప్రకటించనున్నాం అని తెలియజేశారు. అయితే దిల్ రాజు ప్రస్తుతం రామ్ తో ‘హలోగురు ప్రేమకోసమే’ , సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘మహర్షి’ అనే చిత్రాలను నిర్మిస్తున్నారు. ’ హలోగురు ప్రేమ కోస‌మే ‘ అక్టోబర్ 18న విడుదలకానుండ‌గా, మ‌హ‌ర్షి మూవీ రిలీజ్‌పై క్లారిటీ లేదు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత 96 రీమేక్ మొద‌లు పెట్ట‌నున్నాడ‌ని అంటున్నారు. అయితే ఈ రీమేక్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో నాని, త్రిష పాత్ర‌లో స‌మంత న‌టించనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. నాని, స‌మంత క‌లిసి ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు, ఈగ చిత్రాలు చేయ‌గా రీమేక్ చిత్రంలో వీరిద్ద‌రు ఓకే అయితే క్రేజీ కాంబో హ్య‌ట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మంటున్నారు.


2403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles