96 చిత్రానికి రీమేక్‌గా 99

Sat,December 15, 2018 10:10 AM
96 movie remake in kannada

ఈ ఏడాది త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన చిత్రం 96. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. తెలుగు రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా త్వ‌ర‌లోనే ఈ మూవీని రీమేక్ చేయ‌నున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం క‌న్న‌డ‌లోను రీమేక్ కాబోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌ల‌యాళ న‌టి భావ‌న ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రం రూపొంద‌నుంద‌ని అంటున్నారు. విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో గ‌ణేష్ కనిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. 99 అనే టైటిల్‌ని క‌న్న‌డ వ‌ర్షెన్‌కి ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. రాము ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థ క‌న్న‌డ వ‌ర్షెన్‌కి సంబంధించిన రైట్స్‌ని చేజిక్కించుకోగా, ప్రీత‌మ్ గుబ్బి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. అతి త్వ‌ర‌లో తెలుగు వ‌ర్షెన్‌ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నుండ‌గా, ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎవ‌రిని తీసుకోవాల‌నే దానిపై చిత్ర బృందం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుపుతుంది.

2116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles