మాంచి కిక్ ఇస్తున్న '90ఎంఎల్' చిత్ర టీజ‌ర్

Sat,September 21, 2019 10:35 AM

ఆర్ ఎక్స్ 100, హిప్పీ, గుణ‌369, గ్యాంగ్ లీడ‌ర్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న కుర్ర హీరో కార్తికేయ‌. ఆయ‌న తాజాగా కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మాణంలో 90ఎం.ఎల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. హిలేరియ‌స్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కార్తికేయ.. దేవ‌దాసు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. డ్రింక‌ర్ ఎందుకు అయ్యాడు, ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌గా ఎలా పేరు తెచ్చుకున్నాడు వంటి అంశాల‌ని చాలా ఆస‌క్తిక‌రంగా చూపించ‌నున్నార‌ట‌. అక్టోబ‌ర్ 7వ తేదీకి మొత్తం టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మూడు పాట‌ల‌ను యూర‌ప్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రించ‌నున్న‌ట్టు మేక‌ర్స్ తెలిపారు. అనూప్ రూబెన్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు కార్తికేయ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. డైలాగ్స్ కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. మీరు చిత్ర టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.


1222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles