ఒకే ఫ్రేములో అలనాటి తారలు..

Tue,November 21, 2017 03:06 PM
80s celebrities reunion

80వ దశకంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటీ నటులందరు ప్రతి సంవత్సరం పర్టిక్యులర్ ప్లేస్ లో థీమ్ పార్టీ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అలనాటి స్టార్ హీరోయిన్స్ సుహాసిని, రాధిక స్టార్ట్ చేసిన ఈ ఈవెంట్ ని వారందరు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈ ఈవెంట్ లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ నటీనటులు పాల్గొంటారు. 80వ సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో నిర్వహించే ఈ వేడుకలో అందరూ ఒకే రంగు దుస్తులు ధరించి తమ సహనటులతో కలిసి సందడి చేస్తారు.


ఇప్పటికే ఏడు సార్లు కలుసుకున్న 80వ దశకం స్టార్స్ నవంబర్ 17న మళ్ళీ కలిసారు. 28 మంది సినీ తారలు మహాబలిపురంలో రెండు రోజులు ఎంజాయ్ చేశారు. వీరిలా కలవడం ఎనిమిదో సారి కాగా, పర్పుల్ కలర్ డ్రెస్ ధరించిన వీరందరిని ఒకే చోట ఇలా చూస్తుంటే అభిమానుల ఆనందం కట్టులు తెంచుకుంటుంది. ప్రస్తుతం వీరి గ్రూప్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ గ్రూప్ లో చిరంజీవి, వెంకటేశ్, సురేశ్, భానుచందర్, శరత్కుమార్, నరేష్, రెహమాన్, జయసుధ, రాధిక, శోభన, సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ, సుమలత, నదియ, రాధ, లిజీ, రేవతి తదితరులు ఉన్నారు.


మరో ముఖ్య విశేషమేమేంటే ‘80'వ సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో నిర్వహించే ఈ వేడుకలో ర్యాంప్ వాక్ కూడా ఏర్పాటు చేశారట. ఇందులో అప్పటి హీరోలు, హీరోయిన్స్ కూడా పాల్గొన్నారు. 28 మంది టీములుగా డివైడ్ అయి ర్యాంప్ వాక్ చేయగా చిరంజీవి లీడ్ చేసిన టీం విజయం సాధించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ లో 80వ దశకానికి చెందిన కొందరు తారలు చైనాలో థీమే పార్టీ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో చిరంజీవి,సురేఖలతో పాటు రాధిక.. సుహాసిని.. లిజి.. భాగ్యరాజా.. ఖుష్బూ.. సరిత వంటి సెలబ్రిటీలు ఉన్నారు.



5336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS