ఆడిషన్స్ కు 15వేల మంది..మరి సెలెక్ట్ అయింది..

Mon,December 11, 2017 10:45 PM


ముంబై : బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ రోషన్‌ ‘సూపర్‌ 30’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ గణిత శాస్త్ర నిపుణులు ఆనంద్‌ కుమార్‌ జీవితకథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. వికాస్‌ బెహల్‌ తెరకెక్కించనున్న ఈ మూవీలో హృతిక్‌ ఐఐటీ, జేఈఈ విద్యార్థులకు గణితంలో పాఠాలు నేర్పించిన ఆనంద్‌ కుమార్‌ పాత్రలో నటించనున్నారు. సూపర్ 30లో హృతిక్ కు స్టూడెంట్స్ గా నటించే వాళ్లని ఎంపిక చేసేందుకు చిత్రయూనిట్ ఆడిషన్స్ నిర్వహించింది. ఈ ఆడిషన్స్ కు ఏకంగా 15వేల మంది విద్యార్థులు రాగా.. వారిలో నుంచి 78 మంది విద్యార్థులను చిత్రయూనిట్ ఫైనల్ చేసిందట. 2018 నుంచి సూపర్‌ 30 షూటింగ్ ప్రారంభం కానుంది.

2596
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles