యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.70 కోట్లు ఖర్చు..!

Thu,July 18, 2019 10:47 PM
70 crores expends for saaho fight sequence !

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘సాహో’. అంతర్జాతీయ ప్రమాణాలతో ైస్టెలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్‌ను దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో ఇటీవలే చిత్ర బృందం తెరకెక్కించిందట. ఎనిమిది నిమిషాల నిడివితో కూడిన ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ను అబుదాబిలో ఓ ఎడారి సెట్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

రష్‌ అవర్‌-3, హెల్‌బోయ్‌తో పాటు పలు హాలీవుడ్‌ సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీని అందించిన పెంగ్‌ఝాంగ్‌ సారథ్యంలో సుమారు వంద మందికి పైగా విదేశీ ఫైటర్లతో ప్రభాస్‌ తలపడే ఈ పోరాట ఘట్టం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆగస్ట్‌ 15న సినిమాను విడుదలచేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడినట్లు వార్తలు వచ్చినా..వాటిపై దర్శకనిర్మాతలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles