ఏడేళ్ళు పూర్తి చేసుకున్న గ‌బ్బ‌ర్ సింగ్

Sat,May 11, 2019 09:01 AM
7 years for Gabbar Singh

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరియ‌ర్‌కి మంచి బూస్ట‌ప్ ఇచ్చిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌వుతున్న ప‌వ‌న్‌కి ఈ చిత్ర విజ‌యం కొండంత బలాన్ని ఇచ్చింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో గబ్బ‌ర్ సింగ్ గ్యాంగ్‌తో ప‌వన్ క‌ళ్యాణ్ చేసే కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. మే 11, 2012న విడుద‌లైన ఈ చిత్రం విడుద‌లై నేటితో ఏడేళ్ళు అవుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్ త‌న ట్విట్ట‌ర్‌లో పాత జ్ఞాప‌కాలు గుర్తు చేసుకున్నారు. నా వెన్ను తట్టి , నా వెనకాలే ఉండి , సదా నా విజయం కోరుకునే... నా గబ్బర్ సింగ్‌కి ...మరొక్కమారు ధన్యవాదాలు చెబుతూ.... ఏడేళ్ళ గ‌బ్బ‌ర్ సింగ్ అని పేర్కొన్నారు. సినిమా లోకేష‌న్‌కి సంబంధించిన ఫోటోల‌ని కూడా హ‌రీష్ శంక‌ర్ షేర్ చేశారు. ఇవి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రానికి సీక్వెల్‌గా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం తెర‌కెక్క‌గా,ఈ మూవీ అంత విజ‌యం సాధించ‌లేక పోయింది. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ వాల్మీకి అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. త‌మిళ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.2535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles