రిప‌బ్లిక్‌ డే సంద‌ర్భంగా ఏడు సినిమాలు రిలీజ్‌కి రెడీ

Sat,January 20, 2018 09:35 AM
7 movies released on January 26

ఈ ఏడాది సంక్రాంతికి మూడు భారీ సినిమాలు విడుద‌ల కావ‌డంతో థియేట‌ర్స్ క‌ళ‌క‌ళ‌లాడాయి. ఇక కాస్త గ్యాప్ తర్వాత మ‌ళ్ళీ బ‌డా స్టార్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మ‌య్యాయి. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం పుర‌స్క‌రించుకొని ఏడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఇందులో సంజ‌య్ లీలా భ‌న్సాలీ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ద్మావ‌త్‌ జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుండ‌గా, అదే రోజు అక్ష‌య్ కుమార్ ప్యాడ్ మాన్ చిత్రం విడుద‌ల కానుంది. ఈ రెండు చిత్రాలు తెలుగులోను విడుద‌ల కానున్నాయి. ఇక అనుష్క నటించిన బాగమతి రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జన‌వ‌రి 26న విడుద‌ల కానుండ‌గా, మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఆచారి అమెరికా యాత్ర, హౌరా బ్రిడ్జ్ అనే ఒక చిన్న సినిమా అదే రోజు థియేట‌ర్స్‌లోకి రానున్నాయి. వీటితో పాటు తమిళ హీరో విక్రమ్ తమన్నా తో జంటగా నటించిన స్కెచ్ సినిమా మరియు విశాల్ అభిమాన్యుడు జనవరి 26న మన ముందుకు రాబోతున్నాయి. అంటే రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా సినీ ల‌వ‌ర్స్‌కి మంచి ఎంట‌ర్‌టైన్ దొర‌క‌నుండ‌గా, ఈ ఏడింటింలో ఏ మూవీ అభిమానుల‌ని ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటుందో అని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

9630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS