నటుడు నాగశౌర్యకు రూ.500 జరిమానా

Tue,August 13, 2019 05:15 PM


హైదరాబాద్ : ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన టాలీవుడ్ నటుడు నాగశౌర్యకు పోలీసులు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారులో ప్రయాణిస్తున్న నాగశౌర్యకు రూ.500 జరిమానా విధించారు. నాగశౌర్య కారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి వెళ్తుండగా పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ ఐ రవి నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేసి జరిమానా వేశారు. కారులో ఉన్న మనిషి కనిపించకుండా..కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ లను పెట్టుకోవడం సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్-2012 ఉల్లంఘన కిందికి వస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడం తప్పనిసరి.


ఇటీవలే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు పోలీసులు జరిమానా విధించిన విషయం తెలిసిందే. నగరంలోని మూసాపేట్‌ శ్రీరాములు థియేటర్‌ వద్ద వర్మ తన సహదర్శకులతో కలిసి బైక్‌పై ట్రిపుల్‌ రైడ్‌ చేశారు. రాంగోపాల్‌వర్మ ట్రిపుల్‌ డ్రైవింగ్‌ వ్యవహారంపై స్పందించిన పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడంతో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘన కింద వర్మ కు రూ.1350 జరిమానా విధించారు.

2468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles