41 సంవ‌త్స‌రాల స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీ..

Sun,September 22, 2019 08:41 AM

సినిమా అనేది ఓ సుదీర్ఘ ప్రయాణం. ఇందులో కష్ట సుఖాలతో పాటు తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఎంతో క‌ష్ట‌ప‌డితే కాని పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌లేం. ఇక మెగాస్టార్ అనే బిరుదు పొందాలంటే దాని కోసం ఎంత కృషి చేయాల్సి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎలాంటి స‌పోర్ట్ లేకుండా టాలీవుడ్ మెగాస్టార్ బిరుదు అందుకున్న చిరంజీవి నేటితో సినిమా ఇండ‌స్ట్రీలో 41 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయ‌న న‌టించిన తొలి చిత్రం ప్రాణం ఖ‌రీదు సెప్టెంబ‌ర్ 22,1978లో విడుద‌లైంది. అయితే పునాది రాళ్ళ‌తో న‌ట ప్ర‌స్థానం ప్రారంభించినప్ప‌టికి, ప్రాణం ఖ‌రీదు సినిమా ముందుగా రిలీజ్ అయింది.


ప్రాణం ఖ‌రీదు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు తన వందో సినిమాగా త్రినేత్రుడు అనే సినిమా చేశాడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 22, 1988లో విడుద‌లైంది. ఇక త‌న తాజా చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి సెప్టెంబ‌ర్ 22,2019న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జ‌రుపుకుంటుంది. మొత్తానికి చిరు కెరీర్‌లో మైలుస్టోన్‌గా నిలిచిన చిత్రాలకి, సెప్టెంబ‌ర్ 22కి ఏదో సంబంధం ఉంద‌నే చెప్పాలి. సైరా చిత్రంపై అభిమానుల‌లో భారీ అంచనాలు నెల‌కొని ఉండ‌గా, ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేస్తున్నారు.

2097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles