ప్ర‌భాస్ సాహోకి 350 కోట్ల బ‌డ్జెట్

Fri,May 19, 2017 05:07 PM
350 crores deal for sahoo movie

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి 2 చిత్రం తాజాగా 1500 కోట్ల మార్క్ ని సాధించింది. ఈ చిత్రంతో ప్ర‌భాస్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ప్ర‌స్తుతం ర‌న్ రాజా ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ సాహో అనే చిత్రాన్ని చేస్తుండ‌గా, ఈ చిత్రం 150 కోట్ల బ‌డ్జెట్ తో యూవి క్రియేష‌న్స్ బేన‌ర్ పై నిర్మిత‌మ‌వుతుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఏకకాలంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం మ‌లయాళంలో డ‌బ్బింగ్ వ‌ర్షెన్ తో విడుద‌ల కానుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఓ బాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ యూవీ క్రియేష‌న్స్ కి భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని తెలుస్తుంది. సాహూ థియేట్రిక‌ల్ రైట్స్ కోసం 350 కోట్ల బ‌డ్జెట్ ని వారు ఆఫ‌ర్ చేసార‌ని టాక్. నిజంగా ఈ డీల్ ఓకే అయితే మూవీ సెట్స్ పైకి వెళ్ల‌క ముందే చిత్ర నిర్మాణ సంస్థ కిట్టిలో 200 కోట్ల ప్రాఫిట్ వ‌చ్చిప‌డ్డ‌ట్టే అని అంటున్నారు.

2211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS