టాలీవుడ్ హీరో తండ్రికి మూడేళ్ళ జైలు

Sat,April 21, 2018 09:04 AM
3 years jail for tollywood actor father

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ తండ్రి బ‌స‌వ‌రాజుకి కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. 2013లో త‌న భార్య రాజ్య‌ల‌క్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్‌.ఎన్‌.రాజు, సన్యాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావుల పేర్ల మీద న‌కిలీ బంగారం తాక‌ట్టు పెట్టి 9.85 ల‌క్ష‌ల రూపాయ‌లు లోన్ తీసుకున్నార‌ట బ‌స‌వ‌రాజు. బ్యాంక్ అధికారుల త‌నిఖీల్లో ఆ బంగారం న‌కిలీది అని తేల‌డంతో మేనేజ‌ర్ గ‌రికిపాటి సుబ్ర‌హ్మ‌ణ్యం, బ‌స‌వ‌రాజుపై గోపాల‌ప‌ట్నం పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.అయితే ఈ కేసు తాజాగా విచార‌ణ‌కి రావ‌డంతో మేజిస్ట్రేట్ స‌న్నీ ప‌ర్విన్ సుల్తానా బేగం రాజ్ త‌రుణ్ తండ్రి బ‌స‌వ‌రాజుకి మూడేళ్ళ జైలు శిక్ష‌తో పాటు 20వేల రూపాయ‌ల జరిమానా విధించారు. బ‌స‌వ‌రాజు విశాఖ‌ప‌ట్నం వేప‌గుంట‌కి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచ‌లం బ్రాంచ్‌లో అసిస్టెంట్ క్యాషియ‌ర్‌గా విధులు నిర్వ‌హించేవారు. రాజ్ త‌రుణ్ 2013లో ఉయ్యాల జంపాల అనే సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం కాగా, కెరీర్‌లో చాలా మంచి చిత్రాలు చేశాడు. ఈ ఏడాది రంగుల రాట్నం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ న‌టుడు ప్ర‌స్తుతం అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వర్ అనే సినిమా చేస్తున్నాడు.

3677
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS