బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ‌డా ఫైట్.. సంద‌డి చేయ‌నున్న మూడు చిత్రాలు

Wed,November 13, 2019 01:30 PM

ఈ వారం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విడుద‌ల కానున్న చిత్రాలు ఇటు తెలుగు, అటు త‌మిళ భాష‌ల‌లో సంద‌డి చేసేందుకు సిద్ద‌మ‌య్యాయి. ఈ మూడు చిత్రాల‌పై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉండ‌గా, ఏ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎక్క‌వ‌గా అల‌రిస్తుంద‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి రీసెంట్‌గా కోలీవుడ్‌లో ‘సంగతమిళన్’ అనే చిత్రాన్ని చేశాడు. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా న‌వంబ‌ర్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సైరా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంతో మ‌రింత‌గా అల‌రించాల‌ని భావిస్తున్నారు.


ఇక విశాల్‌, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుంద‌ర్ తెర‌కెక్కించిన చిత్రం యాక్ష‌న్.ఈ మూవీ కూడా న‌వంబ‌ర్ 15న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు సిద్ద‌మైంది. చిత్రంలో రానా.. లైట్స్ కెమెరా యాక్ష‌న్ అనే పాట పాడ‌డంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన ట్రైల‌ర్, టీజ‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ ట్యాగ్ లైన్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా న‌వంబర్ 15న విడుద‌ల కానుంది. చిత్రంలో సందీప్ కిష‌న్ లాయ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్నితెర‌కెక్కించారు. లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హ‌న్సిక, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ మూవీపై కూడా చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.

2014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles