యూఎస్‌లో 2 స్టేట్స్ చివరి షెడ్యూల్‌

Sat,December 22, 2018 11:45 AM
2 states Final schedule in us

యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివానీ, యంగ్ హీరో అడ‌వి శేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వెంక‌ట్ కుంచ తెర‌కెక్కిస్తున్న చిత్రం 2 స్టేట్స్. ఈ చిత్రంతో శివానీ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ‘2 స్టేట్స్’ హిందీ చిత్రం అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్ అవుతుంది. అనూప్ రూబెన్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం జ‌న‌వ‌రిలో చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకోనుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం అమెరికాకి వెళ్ళ‌నుంది. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తోన్న ఈ సినిమా లో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ హీరోయిన్ మదర్ పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు రజత్ కపూర్ శివానీ తండ్రి పాత్రలో న‌టిస్తున్నాడు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్‌, హేమ, ఉత్తేజ్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా షానియల్‌ డియో ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లో చిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డంతో పాటు టీజ‌ర్ కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles