రెండు మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ సంపాదించుకున్న అఖిల్

Sun,April 1, 2018 07:57 AM
2 million followers to akhil

అక్కినేని అఖిల్‌ చేసింది రెండే సినిమాలు అయిన కుర్రాడికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెండితెర‌కి రాక‌ముందే అఖిల్ ప‌లు యాడ్స్‌తో సినీ ప్రేక్ష‌కుల దృష్టిని ఆకర్షించాడు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అఖిల్‌కి ప్ర‌స్తుతం రెండు మిలియ‌న్ల ఫాలోవర్స్ ఉన్నారు. ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు త‌న ప్రాజెక్ట్స్ విషయాలని సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తుంటాడు అఖిల్. అక్కినేని మూడోత‌రం వార‌సుడు .. అఖిల్ అనే సినిమాతో వెండితెర‌కి ఎంట్రీ ఇవ్వ‌గా, రెండో చిత్రాన్ని విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. హ‌లో అనే టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌లేదు. ఇక త్వ‌ర‌లో తొలి ప్రేమ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇటీవ‌లే ఈ చిత్రం లాంచింగ్ కార్య‌క్ర‌మం జ‌రుపుకుంది. ఈ సినిమాతో భారీ విజ‌యం సాధించాలని అఖిల్ భావిస్తున్నాడు. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ డైరెక్ష‌న్‌లోను అఖిల్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

1258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS