ఐపీఎల్‌-11 ఫైనల్లో.. ‘2.ఓ’ టీజర్‌?

Mon,May 21, 2018 03:04 PM
2.0s teaser to be out in IPL Final?

చెన్నై: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. సినిమా విడుదల తేదీని వాయిదా వేయడంతో నిరుత్సాహానికి గురైన అభిమానులకు సినిమాకు సంబంధించి శుభవార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది . తాజాగా సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన తేదీపై సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. రూ.400కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించగా.. గతేడాది దీపావళి రోజున విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చిత్రాన్ని వాయిదా వేశారు. పాటల విడుదల వేడుకను దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వ‌హించిన‌ సంగతి తెలిసిందే.

గత జవవరిలోనే టీజర్ విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా ‘2.ఓ’ టీజర్‌ను మే 27న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఐపీఎల్-11 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విడుదల చేస్తారని వదంతులు వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. అమీ జాక్సన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా అలరించబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తరువాత వచ్చే ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

1914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS