శంకర్ విజువల్ వండర్ 2.0 నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు పదివేలకి పైగా స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. కేవలం హిందీలోనే వంద కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన 2.0 చిత్రం నాలుగు రోజులలో 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. ఎనిమిది రోజులకి గాను ఈ మూవీ 500 కోట్లు సాధించినట్టు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇండియాలో 400 కోట్లకి పైగా వసూళ్లు ఈ చిత్రానికి దక్కగా విదేశాలలో 121 కోట్లకి పైబడే రాబట్టిందని అంటున్నారు .ఈ రోజు లేదా రేపట్లో ఈ మూవీ600 కోట్ల మార్క్ చేరుకుంటుందని భావిస్తున్నారు. దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 2.0 చిత్రం రిలీజ్‌కి ముందే భారీ బిజినెస్ జరుపుకున్న సంగతి తెలిసిందే. చైనాలో వచ్చే ఏడాది 56000కి పైగా స్క్రీన్స్‌లో ఈమూవీ విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చారు.