నెట్టింట సునామి సృష్టిస్తున్న 2.0 టీజ‌ర్

Fri,September 14, 2018 10:11 AM
2.0  teaser gets huge views

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం 2.0 సెప్టెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్నారు. టీజ‌ర్ కోసం ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న అభిమానుల నిరీక్ష‌ణ వినాయ‌క చవితితో తీరింది. వినాయ‌కుని పండుగ సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు శంక‌ర్. భారీ గ్రాఫిక్స్ తో రూపొందిన టీజర్ నెట్టింట సునామి సృష్టిస్తుంది. కేవలం 9 గంటల వ్యవధిలో 1.40 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సినిమా టీజ‌ర్ , 20 గంటలక‌ల్లా 3 కోట్ల వ్యూస్ ను దాటింది. ఒక్క టీజ‌ర్‌కే ఈ రేంజ్ క్రేజ్ ల‌భిస్తే సినిమా విడుద‌లైతే 2.ఓ చిత్రం ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మంటున్నారు విశ్లేష‌కులు. ఈ సినిమా దాదాపు 540 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింద‌ని తెలుస్తుండ‌గా 3డీ వ‌ర్షెన్‌లో థియేట‌ర్స్‌లోకి రానుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే అది కూడా పూర్తి కానుంది. హైద‌రాబాద్‌లో భారీ ఈవెంట్ నిర్వ‌హించి ఆ కార్య‌క్ర‌మంలో ట్రైల‌ర్ విడుద‌ల చేయాల‌ని టీం ప్లాన్ గా తెలుస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

2894
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles