8 ఏళ్ళ‌కు ముందు..త‌ర్వాత‌.. రోబో టీం

Fri,July 27, 2018 11:41 AM
2.0 team before and after

2010లో విడుద‌లైన రోబో చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుంది. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో అటెన్షన్ క్రియేట్ చేస్తున్న 2.0 చిత్రం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నవంబర్‌ 29న సినిమాని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ , సుధాన్సు పాండే, అదిల్ హుస్సేన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 450 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్‌లో ఒక‌రైన రెసుల్ పూకుట్టి త‌న ట్విట్ట‌ర్ ద్వారా రోబో 1, రోబో 2 చిత్రాలని రూపొందించే స‌మయంలో శంక‌ర్‌తో దిగిన ఫోటోలు షేర్ చేశారు. 8 ఏళ్ళ క్రితం రోబో 1 తెర‌కెక్కించే స‌మ‌యంలో తీసిన ఫోటో మొద‌టిది. 8 ఏళ్ళ త‌ర్వాత సౌండ్ డిజైన్ యొక్క మొద‌టి డ్రాఫ్ట్ శంక‌ర్‌కి అందించిన సమయంలో దిగిన ఫోటో రెండోది. సంతోష‌క‌ర‌మైన ముఖాల‌తో ఉన్న‌ ఈ ఫోటోలో టీం అంద‌రం ఎగ్జైటింగ్‌గా ఉన్నాం అని త‌న ట్వీట్ లో తెలిపారు రెసుల్‌.1638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles