HomeLATEST NEWS2.0 release in china with intresting title

ఆస‌క్తిక‌ర టైటిల్‌తో చైనాలో విడుద‌ల కానున్న 2.0

Published: Sat,March 2, 2019 01:41 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 2.0. ర‌జనీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ర‌జ‌నీకాంత్ కెరియ‌ర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా 2.0 నిలిచింది. ర‌జ‌నీకాంత్‌కి దేశ‌, విదేశాల‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేప‌థ్యంలో 2.0 చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు. హెచ్‌వై మీడియా సంస్థ ఇప్ప‌టికే చిత్ర డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ద‌క్కించుకోగా మేలో చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే చైనాలో ఈ చిత్రం 'బాలీవుడ్ రోబో 2.0: రిస‌ర్జెన్స్' అనే టైటిల్‌తో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో చైనాలో విడుద‌లైన బాహుబ‌లి 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

2019 మేలో 2.0 చిత్రాన్ని 10 వేల థియేట‌ర్స్ ( 56 వేల స్క్రీన్స్‌లో ) విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు లైకా గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే . ఇక 3డీలో 47 వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఓ విదేశీయ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఇంత భారీ సంఖ్య‌లో విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి. హెచ్ వై మీడియా అనే డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ 2.0 చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేస్తుంది. 2.0 చిత్రం ఇండియాలోను భారీ సంఖ్య‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల‌లోను ఈ చిత్రం భారీ సంఖ్య‌లో వ‌సూళ్లు రాబ‌ట్టింది.
1431
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology