700 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి కోలీవుడ్ సినిమా

Fri,December 14, 2018 12:27 PM
2.0 reaches 700 crore mark

శంక‌ర్ విజువ‌ల్ వండ‌ర్ 2.0 నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. దాదాపు ప‌దివేల‌కి పైగా స్క్రీన్స్ లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. కేవ‌లం హిందీలోనే వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన 2.0 చిత్రం ఎనిమిది రోజుల‌కి గాను 500 కోట్లు సాధించింది . సైంటిఫిక్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం ప‌దిహేను రోజుల‌లో 700 కోట్ల క్ల‌బ్‌లో చేరింద‌ని స‌మాచారం. ఇంత వ‌సూళ్ళు సాధించిన తొలి కోలీవుడ్ మూవీగా 2.0 రికార్డుల‌కి ఎక్కింద‌ని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ 710.98 కోట్లు వసూళ్ళు ద‌క్క‌గా, తమిళనాడులో రూ 166.98 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ వెల్లడించారు. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్ , అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మించింది. చిత్రంలో అక్ష‌య్ కుమార్ ప‌క్షి రాజా పాత్ర‌లో క‌నిపించ‌గా, అమీ వెన్నెల అనే రోబోగా అల‌రించింది. ఇక రజనీకాంత్‌ డాక్టర్‌ వశీకరణ్‌, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్‌ 3.ఓ వంటి పలు పాత్రల్లో అల‌రించారు .

3438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles