రెండు నిమిషాల 2.0 వీడియో లీక్ .!

Wed,August 22, 2018 03:08 PM
2.0 movie video leaked

సూపర్ స్టార్ రజనీకాంత్ ,శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ 2.0. గత ఏడాది విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. నవంబర్ 29న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమాపై భారీ అంచనాలు పెంచిన టీం గతంలో పలు పోస్టర్స్ రిలీజ్ చేసింది. కాని ఇప్పటి వరకు టీజర్ విడుదల చేయలేదు. దీంతో అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లీక్ అవుతున్న క్లిప్ లని చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.

2.0 పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మూవీకి సంబంధించి ఏదో ఒకటి బయటకి వస్తుంది. తాజాగా బిబిసి ఛానల్ 2.0 సినిమాపై డాక్యుమెంటరీ తీస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన 2.0 మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో హీరోయిన్ అమీ జాక్సన్ సెట్ లో సరదాగా స్టెప్స్ వేస్తూ అల్లరి చేస్తుంది. ఇక రజనీకాంత్ తనదైన స్టైల్ లో వాకింగ్ చేసుకుంటూ వెళుతూ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చాడు. అతి త్వరలో టీజర్ విడుదల చేయాలని టీం భావిస్తుండగా, ఇలా క్లిప్స్ లీకవ్వడం యూనిట్ ని ఆందోళనకి గురి చేస్తుంది. రెండు మూడు వారాలలో చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫస్ట్ కాపీ ఇస్తారట. ఆ తర్వాత సెన్సార్ కి వెళతారట. అక్టోబర్ లో హైదరాబాద్ లో సైతం ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని యూనిట్ భావిస్తుందట.

3627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles