2.0 టీజర్ టైం వచ్చేసింది..

Fri,September 7, 2018 05:06 PM
2.0 movie teaser time revealed by akshaykumar

ముంబై: తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో 2.0 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రేజీ సినిమా టీజర్ సమయం రానే వచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రకటించాడు. 2.0 టీజర్ (త్రీడీ) ఈ నెల 13న వినాయక చవితి శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తుందని ట్వీట్ చేశాడు అక్షయ్. అంతేకాకుండా 2.0లో తన పాత్రకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశాడు అక్షయ్. దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ కూడా ఈ విషయాన్ని చెప్తూ మరో పోస్టర్‌ను పంచుకున్నాడు.

2010లో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా వస్తున ఈ మూవీలో అమీజాక్సన్, అదిల్ హుస్సేన్, సుదన్షు పాండే, అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ప్రమోషన్స్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. లైకా ప్రొడక్షన్స్ 2.0 చిత్రాన్ని సుమారు 400 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.
3951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles