'2.ఓ' చిత్ర విడుద‌ల మ‌రింత ఆల‌స్యం కానుందా ?

Sat,June 16, 2018 12:57 PM
2.0 movie release

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అత్యంత ప్ర‌తిష్టాత్మక చిత్రం 2. ఓ. చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైన‌ప్ప‌టికి సినిమా రిలీజ్‌కి మాత్రం చాలా స‌మ‌యం ప‌డుతుంది. కంప్యూటర్‌ గ్రాఫిక్‌ పనులు పలు దేశాల్లో జ‌రుగుతున్న క్ర‌మంలో సినిమా విడుద‌ల లేట్ అవుతుందని అన్నారు. అస‌లు ఈ చిత్రం గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లోనే విడుద‌ల కావ‌ల‌సి ఉంది. కాని దీపావ‌ళికి రిలీజ్ అన్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 25న 2.ఓ విడుద‌ల అవుతుందని అనుకున్నప్ప‌టికి అదీ జ‌ర‌గ‌లేదు. ఈ దీపావ‌ళికి చిత్రం ప‌క్కా విడుద‌ల అవుతుంద‌ని అంద‌రు భావిస్తున్న‌ప్ప‌టికి సినిమా ఆ టైంకి రావ‌డం కూడా డౌటే అనే టాక్ వినిపిస్తుంది.

దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో రోబో 2 చిత్రాన్ని తెర‌కెక్కించిన శంక‌ర్ రెండేళ్ల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేశాడు. కాని గ్రాఫిక్స్ ప‌నుల విష‌యంలో చాలా స‌మ‌యం ప‌డుతుంది. ‘2.ఓ’ గ్రాఫిక్‌ పనులు చూస్తున్న లండన్‌ సంస్థ ఓ సమస్యలో చిక్కుకుందని, అందువల్ల మరింత ఆలస్యమవుతుందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇదే నిజ‌మైతే ఈ చిత్రం దీపావ‌ళికి కూడా రావ‌డం క‌ష్ట‌మే. బాహుబ‌లి సినిమా క‌లెక్ష‌న్స్‌ని త‌ల‌ద‌న్నేలా రోబో 2 చిత్రం ఉంటుంద‌ని, ఈ సినిమా హాలీవుడ్ త‌ర‌హాలో ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో అభిమానులు సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. కాని రోజు రోజుకి 2.0ఓ రిలీజ్ డేట్ వెన‌క్కు వెళుతుంది. మ‌రి శంకర్ చిత్ర రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో చూడాలి.

1663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles