2.0 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..

Mon,October 23, 2017 12:37 PM
2.0 movie Audio to Releases on October 27th


చెన్నై : శంకర్, రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 2.0. రోబోకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను శంకర్ హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ మూవీస్‌కు ఏ మాత్రం తగ్గకుండా తీస్తున్నాడు. 2.0 మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందించిన 2.0 ఆడియో త్వరలోనే ఆడియెన్స్‌కు అందుబాటులో రానుంది. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 27న నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించినట్లు సమాచారం. దుబాయ్‌లోని బుర్జ్ పార్క్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి..ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు.

1991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles