సోష‌ల్ మీడియాలో '2.0' హ‌వా

Fri,November 16, 2018 10:28 AM
2.0 Is All Over with Social Media

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ 2.0. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ చిత్రం నవంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. రిలీజ్‌కి మ‌రి కొద్ది రోజుల స‌మ‌యం మాత్రమే ఉండ‌డంతో చిత్రాన్ని జ‌నాల‌లోకి తీసుకేళ్ళేందుకు నిర్మాత‌లు వినూత్న ఆలోచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్స్‌తో పాటు వాట్సాప్‌లోను ప‌లు జిఫ్ ఇమేజ్‌లు, స్టిక్ట‌ర్స్‌, మీమ్స్ రిలీజ్ చేశారు. వీటిని నెటిజ‌న్స్ వివిధ ర‌కాలుగా వాడుతుండ‌డంతో చిత్రానికి మంచి ప్ర‌మోష‌న్ ల‌భిస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని శంక‌ర్ 3డీ కెమెరాల‌తో తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్ ఉండ‌గా,వీటికి సంబంధించిన వ‌ర్క్ విదేశాల‌లో జ‌రిపారు. ర‌జనీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహ‌మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మార‌నుంది. ప‌లువురు హాలీవుడ్ నిపుణులు ఈ సినిమాకి పని చేయగా, చిత్రం ప్ర‌తి సినీ ప్రేక్ష‌కుడికి స‌రికొత్త అనుభూతి క‌లిగించ‌నుంద‌ని అంటున్నారు. భార‌తీయ సినిమా చ‌రిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 4డీ సౌండ్‌ టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి.


1649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles