తెలుగు రాష్ట్రాల‌లోను 2.0 హ‌వా

Fri,November 30, 2018 12:29 PM
2.0 gets huge collections in telugu states

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం 2.0. సామాజిక అంశంకి గ్రాఫిక్ మాయాజాలం జోడించి ఈ చిత్రాన్ని ఓ విజువ‌ల్ వండ‌ర్‌లా తెర‌కెక్కించాడు శంక‌ర్ . 2.0 చిత్రం ప్ర‌స్తుతం ఇంటా బ‌య‌టా రికార్డులు సృష్టిస్తుంది. ముఖ్యంగా మ‌న తెలుగు రాష్ట్రాల‌లో రజ‌నీకాంత్ గ‌త సినిమాల క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్స్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణ లో రూ. 12.53 కోట్ల షేర్ ను రాబట్టింది 2.0 మూవీ. రానున్న రోజుల‌లోను ఇదే జోరు కొన‌సాగిస్తే ర‌జ‌నీకాంత్ పేరిట స‌రికొత్త రికార్డులు న‌మోద‌వ్వ‌డం ఖాయం అంటున్నారు. ర‌జ‌నీకాంత్ గ‌త చిత్రాలు లింగ‌, క‌బాలి, కాలా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో నిరాశ‌లో ఉన్న అభిమానుల‌కి 2.0 చిత్రం మంచి బూస్ట‌ప్ ఇచ్చింది. అమీ జాక్స‌న్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించింది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు.

3004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles