కోలీవుడ్‌లో రూపొందనున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం

Thu,May 2, 2019 11:10 AM
2.0 director Shankar to bring Thalapathy Vijay and Chiyaan Vikram

ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. స్టార్ హీరోలు కూడా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుండ‌డంతో విభిన్న క‌థ‌ల‌తో ప‌లు మల్టీ స్టార‌ర్స్ రూపొందుతున్నాయి. ద‌ర్శ‌క దిగ్గజం శంక‌ర్ కూడా మ‌ల్టీ స్టారర్ చిత్రం రూపొందించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట‌. కొద్ది రోజుల కింద‌ట క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో భారతీయుడు 2 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు శంక‌ర్. ఈ చిత్ర షూటింగ్‌కి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ‌డ్జెట్ విష‌యంతో పాటు క‌మ‌ల్ డేట్స్ విష‌యంలో చిత్ర షూటింగ్ ప‌లు స‌మ‌స్య‌ల‌ని ఎదుర్కొంటున్న‌ట్టు కోలీవుడ్ టాక్. అయితే భారతీయుడు 2 చిత్రానికి ముందు కోలీవుడ్ టాప్ హీరోస్ విజ‌య్, విక్ర‌మ్ కాంబినేషన్‌లో ఓ సినిమాని తెర‌కెక్కించి రిలీజ్ చేయాల‌ని శంక‌ర్ అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించిన క‌థ విష‌యంలో శంక‌ర్ క‌స‌రత్తులు చేస్తున్నాడ‌ట‌. మ‌రి ఈ వార్తే నిజ‌మైతే కోలీవుడ్ అభిమానుల‌ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. విజ‌య్ ప్ర‌స్తుతం తన 63వ సినిమాతో బిజీగా ఉన్నాడు. చియాన్ విక్ర‌మ్ న 56వ సినిమాతో బిజీగా ఉన్నాడు. క‌ద‌రం కొంద‌న్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌తాకంపై క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

1558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles