బాహుబ‌లి 2 రికార్డుల‌ని బీట్ చేస్తున్న 2.0..!

Sun,January 21, 2018 04:46 PM
2.0 breaks the record of baahubali2

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం 2.0. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం బాహుబ‌లి రికార్డుల‌ని బ్రేక్ చేస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా. భారీ ఎత్తున ఆడియో వేడుక జ‌రిపిన 2.0 చిత్ర యూనిట్ ఈ మూవీని 3డీ ఫార్మాల్‌లోను విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌కి పసందైన విందు అందించే ప్లాన్ చేస్తుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌కి సంబంధించిన వార్త‌లు షాకింగ్‌గా మారాయి. రోబో-2 మలయాళ డిస్ట్రిబ్యూషన్ హక్కుల‌ను ఏకంగా పదహారు కోట్ల రూపాయలకు అమ్మారని సమాచారం. తెలుగు, తమిళ భాషలతో పోలిస్తే చిన్నది అయిన మలయాళీ మార్కెట్ లో మాత్రం ఒక అనువాద సినిమా ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం ఇదే తొలి సారి అని తెలుస్తోంది. బాహుబ‌లి 2 పదిన్న‌ర కోట్ల‌కి అమ్ముడు పోగా, మొన్న‌టి వ‌ర‌కు ఇదే బెస్ట్‌గా చెప్పారు. కాని ఆ రికార్డుని 2.0 అధిగ‌మిస్తూ స‌రికొత్త ట్రెండ్ చేస్తుంది.

2879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles