100 కోట్లు దాటిన 2.0

Sat,December 1, 2018 03:12 PM
2.0 box office collection crosses Rs 100 crore mark

ముంబై : త‌లైవా ర‌జ‌నీకాంత్ న‌టించిన 2.0 చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద దూసుకెళ్లుతున్న‌ది. ఆ ఫిల్మ్ రెండ‌వ రోజు క‌లెక్ష‌న్లు వంద కోట్లు దాటాయి. విడుద‌లైన మొద‌టి రోజు 2.0 మొత్తం 73.5 కోట్లు ఆర్జించింది. అయితే రెండ‌వ రోజు కేవ‌లం హిందీలోనే 38.25 కోట్లు సంపాదించింది. దీంతో రెండ‌వ రోజు క‌లెక్ష‌న్లు 111.5 కోట్ల‌కు చేరుకున్న‌ది. రెండ‌వ రోజు క‌లెక్ష‌న్ల‌లో త‌మిళ‌, తెలుగు వ‌ర్షెన్ల వ‌సూళ్ల‌ను క‌ల‌ప‌లేదు. ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఓవ‌ర్‌సీస్‌లోనూ 2.0 ఫిల్మ్ మెరుగైన క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టుతోంది. యూఎస్‌లో మొద‌టి రోజు 2.05 కోట్లు వ‌సూల్ చేసింది. ఆస్ట్రేలియాలో 58.46 ల‌క్ష‌లు, న్యూజిలాండ్‌లో 11.11 ల‌క్ష‌లు వ‌సూల‌య్యాయి. రోబోకు సీక్వెల్‌గా వ‌చ్చిన 2.0 సైన్స్ థ్రిల్ల‌ర్‌ను శంక‌ర్ డైర‌క్ట్ చేశాడు. 543 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు.2860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles