ఆ కాంబినేషన్‌లో సినిమా రావడానికి 15 ఏళ్లా ..

Sun,February 7, 2016 08:40 AM
15 years to take crazy combination movie

ఒకరు తన కథాబలంతో సంచలనాలు క్రియేట్ చేసే డైరెక్టర్ అయితే, మరొకరు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే హీరో. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అదొక సంచలనమే . దాదాపు 15 ఏళ్లక్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో ధీనా అనే చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రం దర్శకుడితో పాటు , కథానాయకుడుకి మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాకపోవడం విశేషం.

కోలివుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న మురుగదాస్ సంచలనాలు క్రియేట్ చేస్తుంటే, అజిత్ డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ చిత్రం రూపొందుతుందనే వార్తలు వస్తోండగా, ఈ అపూర్వ కలయికలో మరో సినిమా రావడానికి దాదాపు 15 ఏళ్ళు పట్టిందట. గతంలో ఎంతో మంది ఈ ఇద్దరి కలయికలో సినిమా చేయాలని ప్రయత్నించిన కూడా అది సఫలం కాలేదట.

అజిత్, మురుగదాస్‌లో తెరకెక్కనున్న మూవీకు రెడ్ జాయింట్ మూవీస్ అధినేత ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించగా, గతంలో ఈయన సూర్య, కమల్ వంటి హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు.ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు జరుగుతోండగా త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. మురుగదాస్ ప్రస్తుతం అఖీరా అనే హిందీ చిత్రంతో పాటు మహేష్ తో చేయబోవు ఓ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. అజిత్ సత్యజ్యోతి ఫిలింస్ అనే సంస్థతో ఓ చిత్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్. మరి ఈ నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్ర ముహూర్తమెప్పుడు ఉంటుదనేది తెలియాల్సి ఉంది.

2360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles