ప‌వ‌న్ సాంగ్ కోసం 120 గంట‌లు రిహార్స‌ల్స్

Thu,December 5, 2019 12:00 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తొలి ప్రేమ చిత్రంలో నీ మ‌న‌సే.. సేసే అనే సాంగ్ యూత్ హృద‌యాలని ఎంత‌గా క‌ట్టిప‌డేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఇదే సాంగ్‌ని మిస్ మ్యాచ్ సినిమా కోసం రీమేక్ చేశారు. అంతేకాదు ప‌వ‌న్ చేతుల మీదుగా ఈ సాంగ్‌ని విడుద‌ల చేయించారు. చిత్ర బృందం ప‌నితీరు త‌న‌కెంతో న‌చ్చింద‌ని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. అయితే నాలుగున్న‌ర నిమిషాల సాంగ్ కోసం హీరో ఉద‌య్ శంక‌ర్, హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేష్‌తో పాటు టెక్నీషియ‌న్స్ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో వీడియో ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్‌. 60 మంది డ్యాన్స‌ర్స్‌, 200 మంది టెక్నీషియ‌న్స్ నీ మ‌న‌సే .. సేసే సాంగ్ కోసం 120 గంట‌ల పాటు రిహార్స‌ల్స్ చేశారు. సాంగ్ అద్భుతంగా రావ‌డంతో చిత్ర‌బృందం చాలా సంతోషంగా ఉంది. డిసెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని ఎన్‌వి నిర్మ‌ల్ కుమార్ తెర‌కెక్కించారు.


2334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles