118 టీజ‌ర్‌తో అంచ‌నాలు పెంచిన నంద‌మూరి హీరో

Tue,December 18, 2018 11:45 AM
118 Teaser released

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం త‌న‌ 16వ ప్రాజెక్ట్‌గా 118 చిత్రాన్ని కెవి గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా నటిస్తుండగా షాలిని పాండే ఆయన సతీమణి గా నటిస్తుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు కానుంది. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ ..ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్న విష‌యం విదిత‌మే. చిత్రంలో హ‌రికృష్ణ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ కనిపించ‌నున్నాడు.

4061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles