క‌ళ్యాణ్ రామ్ మూవీ ట్రైల‌ర్‌కి భారీ స్పంద‌న‌

Sat,February 16, 2019 08:05 AM
118 movie trailer released

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం 118. సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, షాలిని పాండే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. మార్చి 1న విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా ఈ చిత్రం ఉంటుంద‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ద‌మ‌వుతంది. క‌ళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ మ్యూజిక్, గుహన్ సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కి హెల్ప్ అయ్యింది. ఈ చిత్రానికి కథ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అన్నీ గుహన్ కావడం విశేషం. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త‌క్కువ టైంలోనే చిత్ర ట్రైల‌ర్‌కి మిలియ‌న్‌కి పైగా వ్యూస్ ల‌భించాయి. ఈ మూవీ క‌ళ్యాణ్ రామ్‌కి మంచి హిట్ అందిస్తుంద‌ని యూనిట్ చెబుతుంది.

2233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles