102 నాటౌట్ ట్రైలర్ వచ్చేసింది

Wed,March 28, 2018 03:11 PM
102 Not Out official trailer is out

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, రిషికపూర్ 27 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటించిన 102 నాటౌట్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. మే 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో ఈ ఇద్దరూ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఓ మై గాడ్‌లాంటి ఓ సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన ఉమేష్ శుక్లా.. ఈ మూవీకి డైరెక్టర్‌గా ఉన్నారు. దీంతో రిలీజ్‌కు ముందే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 102 ఏళ్ల కురువృద్ధుడిగా అమితాబ్, 75 ఏళ్ల వయసున్న కొడుకుగా రిషి కపూర్ నటిస్తున్నారు. గుజరాతీ రచయిత సౌమ్యజోషి రాసిన నాటకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. బిగ్ బీ, రిషి గతంలో ఐదు సినిమాల్లో కలిసి నటించారు. కభీ కభీ (1976), అమర్ అక్బర్ ఆంటోనీ (1977), నసీబ్ (1981), కూలీ (1983), అజూబా (1991) సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరూ మళ్లీ 27 ఏళ్ల తర్వాత జతకట్టారు.

1701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles