వెయిట్ ఈజ్ ఓవ‌ర్‌.. టీజ‌ర్ వ‌చ్చేసింది

Fri,February 9, 2018 12:33 PM
102 Not Out  Official Teaser

27 ఏళ్ళ త‌ర్వాత బాలీవుడ్ స్టార్ హీరోస్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, రిషీ క‌పూర్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం 102 నాటౌట్‌. మే 4న విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌ల అయింది. 102 ఏళ్ళ తండ్రి పాత్ర‌లో అమితాబ్‌, 72 ఏళ్ళ కొడుకు పాత్ర‌లో రిషి క‌పూర్ అద్భుతంగా న‌టించారు. ఉమేష్ శుక్లా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం గుజ‌రాతీ డ్రామా `సౌమ్య జోషి` ర‌చించిన నాట‌కం స్ఫూర్తితో రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ట్రిటాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌- బెంచ్ మార్క్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ మూవీని నిర్మిస్తున్నాయి. ‘పా’ చిత్రంలో ప్రొగేరియా వ్యాధితో బాధపడే 12 సంవత్సరాలు పిల్లవాడిగా నటించిన అమితాబ్‌కు ఇది మరో ఛాలెంజింగ్‌ రోల్‌ అనీ, అలాగే ఇప్పటివరకూ ఎన్నడూ చేయని కేరక్టర్‌ను రిషి చేస్తున్నారనీ యూనిట్‌ వర్గాలు అంటున్నాయి. గ‌తంలో ఈ ఇద్దరు క‌లిసి ‘అమర్‌ అక్బర్‌ ఆంథోనీ’, ‘నసీబ్‌’, ‘కభీ కభీ’, ‘కూలీ’ తదితర విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించిన సంగ‌తి తెలిసిందే.

1494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles