100 %ల‌వ్ త‌మిళ టీజ‌ర్ విడుద‌ల‌

Fri,September 14, 2018 09:28 AM
100% Kadhal Teaser 2.0 released

నాగ చైత‌న్య‌- త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం 100% ల‌వ్. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేయాల‌ని అప్ప‌ట్లో ప్ర‌య‌త్నాలు చేశారు. హిందీలో వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోయిన‌ప్ప‌టికి తమిళంలో మాత్రం త‌న శిష్యుడైన చంద్ర‌మౌళితో ఈ సినిమా రీమేక్ చేస్తున్నాడు సుక్కూ. త‌మిళ వ‌ర్షెన్ లో జీవి ప్ర‌కాశ్ కుమార్ , షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌లుగా ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి 100% కాద‌ల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టీజర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు అచ్చం తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన‌ట్టే ఉండ‌గా,అక్క‌డ కూడా ఈ సినిమా మంచి విజ‌యం సాధించనుంద‌ని టీం భావిస్తుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. 100% కాద‌ల్ చిత్రంతో సుకుమార్ త‌మిళ ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అవుతున్న క్ర‌మంలో శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. టీజ‌ర్‌తో ఫుల్ ఎక్స్ పెక్టేష‌న్స్ పెంచిన టీం అతి త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నుంది. చిత్రానికి జీవి ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

1993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS