ఏడాది పూర్తి చేసుకున్న 'రాజా ది గ్రేట్'

Thu,October 18, 2018 08:50 AM
1 year completed for raja the great

మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రాజా ది గ్రేట్. గ‌త ఏడాది అక్టోబర్ 18న దీపావళి శుభాకాంక్షలతో విడుద‌లైన ఈ చిత్రం అందరి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రంలో కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ హంగులే కాకుండా స‌మాజంకి ఉప‌యోగ‌ప‌డే స‌న్నివేశాలు కూడా ఉన్నాయి. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో రాధిక ముఖ్య పాత్ర పోషించారు. నాకు క‌న‌ప‌డదు స‌ర్‌, ఇట్స్ లాఫింగ్ టైమ్, జ‌కాస్‌, ఐయామ్ బ్లైండ్‌.. బ‌ట్ ఐయామ్ ట్రైండ్‌, గున్న‌మామిడి సాంగ్ ఇలా త‌దిత‌ర అంశాలు సినిమాని ఓ రేంజ్‌లో నిలిచేలా చేశాయి. చిత్ర ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ..సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్ర‌తి ఒక్క‌రికి ధన్య‌వాద‌లు తెలిపాడు. ర‌వితేజ ప్ర‌స్తుతం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో బిజీగా ఉండ‌గా త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం వెంకీ, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఫ్‌2 అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.2126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles