ఒక్క సాంగ్ కోసం భారీ ఖ‌ర్చు చేసిన కాంచ‌న 3 టీం

Sun,April 14, 2019 11:18 AM
1.3 crores used for single song in kanchana

సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్‌లో నాలుగో భాగంగా కాంచ‌న 3 చిత్రం ఏప్రిల్ 19న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్షకుల‌కి సినిమాపై అంచ‌నాలు క‌లిగేలా చేశాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానులు అవాక్క‌య్యేలా చేసింది. ఈ చిత్రంలో ఒక్క సాంగ్ కోసం 1.3 కోట్లు ఖర్చు చేశారని, ఈ సాంగ్ షూటింగ్ ను 6 రోజుల్లో పూర్తి చేయగా 1400 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని అంటున్నారు. తెలుగు, త‌మిళంలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బేన‌ర్‌లో రూపొందిన కాంచ‌న 3 చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు. క‌బీర్ దుహ‌న్ ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించనున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

1534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles