CARTOON OF THE DAY


LATEST NEWS

రిపబ్లిక్ డే వేడుకలకు సర్పంచ్‌లను ఆహ్వానించరాదు

Thu,January 24, 2019 03:58 PM

do not invite sarpanch to republic day says Telangana State Election Commission

హైదరాబాద్ : కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సర్పంచ్, ఉప సర్పంచ్ లుగా పరిగణించి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించరాదు అని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రమాణస్వీకారం ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాతనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు పాల్గొనాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి మాత్రమే జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించింది. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచన చేసింది.

వాడిన టిష్యూలనే మళ్లీ అమ్ముతున్న కంపెనీ.. ఎందుకంటే..!

Thu,January 24, 2019 03:54 PM

Company Selling Used Tissues for approximately 5700 rupees

అవును.. ఆ కంపెనీ ఒకరు వాడిన టిష్యూలనే మళ్లీ అమ్ముతుంది. దాంతో సొమ్ము చేసుకుంటుంది. అది కూడా మామూలు రేటు కాదు.. వాడని టిష్యూలకన్నా వాడిన టిష్యూలకే రేటు ఎక్కువ. ఒక్క టిష్యూ బాక్స్ 5700 రూపాయలు. నమ్మరు కదా. వాడేసిన టిష్యూలను ఎవరు తీసుకుంటారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కానీ.. దాంట్లో పెద్ద మతలబు ఉంది లేండి. డిటెయిల్‌గా చెప్పుకుందాం పదండి.

సాధారణంగా సీజన్ మారుతున్నప్పుడు.. కొత్త సీజన్ వచ్చినప్పుడు రకరకాల వైరస్‌లు, ఫ్లూలు సోకుతుంటాయి. దాని వల్ల జ్వరమో లేక దగ్గు, జలుబు, ఇంకా రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఒక్కసారి ఆ వైరస్ వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. మళ్లీ ఆ సీజన్ అయిపోయే వరకు ఆ వ్యాధి సోకదు. ఈ కాన్సెప్ట్‌నే ఎంచుకున్నది లాస్ ఏంజెల్స్‌కు చెందిన వయెవ్ కంపెనీ.


మీకు రోగాలు కావాలా? రోగాలు తెచ్చుకోవాల‌నుకుంటున్నారా? సీజ‌న‌ల్ రోగాల‌కు ఒక‌సారి తెచ్చుకొని.. నిశ్చింత‌గా జీవించండి. రోగం కావాలంటే మా టిష్యూ వాడండి అంటూ ప్ర‌చారం చేస్తోంది ఆ కంపెనీ. అందుకే.. 200 రకాల వైరసులతో కూడిన టిష్యూలను అమ్ముతోంది కంపెనీ. ఆ టిష్యూలు కూడా మనిషి తుమ్మితే వచ్చే తుప్పిర్లతో ఉంటాయి. ఇంజెక్షన్లు, ట్యాబెట్లు కన్నా.. మనిషి తుమ్మితే వచ్చే వైరస్‌లే బెటర్ అంటోంది కంపెనీ. అందుకే.. ఆ టిష్యూలను అమ్ముతోంది. ఆ టిష్యూలను పీల్చుకున్న వాళ్లకు దాంట్లో ఉండే వైరస్ సోకుతుంది. ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందట. కాకపోతే.. కొంతమంది మాత్రం ఈ టిష్యూలను వ్యతిరేకిస్తున్నారు. కోరి కోరి రోగాలను తెచ్చుకోవడం ఏందిరా సామీ.. అది కూడా మనిషి తుప్పిర్లు ఉన్న టిష్యూలను వాడి.. నీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు బాసు.. అంటూ ఆ కంపెనీని విమర్శిస్తున్నారు.

న్యూజిలాండ్ అందాలకు టీమిండియా ఫిదా

Thu,January 24, 2019 03:38 PM

Team India enroute Tauranga enjoys scenic beauty

టౌరంగా: న్యూజిలాండ్‌పై తొలి వన్డే గెలిచిన ఇండియన్ టీమ్ ఎంజాయింగ్ మూడ్‌లో ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే శనివారం మౌంట్ మాంగానుయ్‌లో జరగనుంది. దీంతో గురువారం నేపియర్ నుంచి టీమ్ రోడ్డు మార్గంలోనే అక్కడికి వెళ్లింది. మధ్యమధ్యలో ఆగుతూ.. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తూ టీమ్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఈ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కుల్‌దీప్‌తోపాటు ధోనీ, చాహల్, రాయుడు, కేదార్ జాదవ్ ఫొటోలకు పోజులిచ్చారు. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచిన విషయం తెలిసిందే. కుల్‌దీప్, షమి, చాహల్ బౌలింగ్‌లో రాణించగా.. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.


ఈ దుష్ట చర్యలను అంతం చేద్దాం: ఎంపీ కవిత

Thu,January 24, 2019 03:34 PM

MP Kavitha comments on National Girl Child Day

హైదరాబాద్: పోషకాహారలేమి, విద్య అందకపోవడంతో పాటు లైంగిక దాడులు దేశ కూతుళ్లపై ఇంకా కొనసాగుతూ.. వారిని బాధిస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఎంపీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ దుష్ట శక్తుల అంతానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు మాత్రమే దేశం నిజమైన ప్రగతివైపు పయనిస్తుందన్నారు.ఈసీని కించపరుస్తూ కాంగ్రెస్ కార్టూన్.. ఓవైసీ ఆగ్రహం

Thu,January 24, 2019 03:22 PM

MIM MP asaduddin owaisi reacts on Congress cartoon against on CEC

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కించపరుస్తూ ప్రదర్శించిన ఓ కార్టూన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ధృతరాష్ర్టుడితో, ఈఆర్‌వో, డీఈవో, సీఈవోలను దుశ్శాసనుడితో, ఓటర్లను ద్రౌపదితో పోల్చుతూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇదే బ్యానర్‌లో సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ ఫోటోలను కూడా ఉంచారు.

ఈ కార్టూన్‌పై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ, నూతనంగా నియమితులైన జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై ఎవరైనా ఇలాంటి కార్టూన్‌లు వేస్తే కాంగ్రెస్ నాయకులు సహిస్తారా? అని ప్రశ్నించారు. ఘోరంగా ఓటమి పాలైన కాంగ్రెస్ ఇలాంటి కార్టూన్లకు తెరలేపిందని ఓవైసీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హద్దులు మీరి ప్రవర్తిస్తోందని ఓవైసీ నిప్పులు చెరిగారు.

17 మంది మ‌హిళ‌లే అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నారు..

Thu,January 24, 2019 03:18 PM

only 17 women entered Sabarimala temple, says Kerala police


తిరువ‌నంత‌పురం: ప‌దేళ్ల నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న 51 మంది మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామిని ద‌ర్శించుకున్న‌ట్లు ఇటీవ‌ల కేర‌ళ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు జాబితా స‌మ‌ర్పించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ జాబితాను స‌వ‌రిస్తూ ఇవాళ ఆ రాష్ట్ర పోలీసులు కొత్త జాబితాను రిలీజ్ చేశారు. 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య ఉన్న మ‌హిళ‌లు కేవ‌లం 17 మంది మాత్ర‌మే ద‌ర్శించుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. గ‌తంలో సుప్రీంకు స‌మ‌ర్పించిన జాబితాలో న‌లుగురు మ‌గ‌వాళ్ల పేర్లు కూడా ఉన్నాయి. అదే జాబితాలో 50 ఏళ్లు దాటిన 30 మంది మ‌హిళల పేర్లు ఉన్నాయి. నూత‌నంగా ఏర్ప‌డిన హైలెవ‌ల్ క‌మిటీ ఆ పేర్ల‌ను తొల‌గించి కొత్త జాబితాను ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, తొంద‌ర‌పాటు వ‌ల్ల మొద‌టి జాబితాను రిలీజ్ చేసిన‌ట్లు అంగీక‌రించారు. అయితే మొద‌ట స‌మ‌ర్పించిన జాబితా పేర్ల‌లో వారి ఆధార్‌తో పాటు ఫోన్ నెంబ‌ర్లు కూడా ఉన్నాయి. ఆ నెంబ‌ర్ల‌కు మీడియా సంస్థ‌లు ఫోన్ చేయ‌డంతో ఆ వివాదం బ‌య‌ట‌ప‌డింది. దీంతో హైలెవ‌ల్ క‌మిటీ మ‌ళ్లీ కొత్త జాబితాను త‌యారు చేసింది. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌చ్చు అని సుప్రీం తీర్పు ఇచ్చిన త‌ర్వాత ఈ తతంగం అంతా జ‌రిగింది.

అది మన బాధ్యత: మ‌హేశ్‌బాబు

Thu,January 24, 2019 03:16 PM

Hero Mahesh Babu comments on National Girl Child Day

హైదరాబాద్: ఆడపిల్లల పట్ల సామాజిక రుగ్మతను రూపుమాపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సినీనటుడు మ‌హేశ్‌బాబు అన్నారు. ప్రతీఏడాది జనవరి 24వ తేదీని జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సమాజంలో బాలికలు, యువతులు ఎదుర్కొంటున్న అసమానతలను ప్రజలకు గుర్తుచేస్తూ.. వారికి సరికొత్త అవకాశాల కల్పనతో పాటు మరింత మద్దతును ప్రకటించేందుకు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నటుడు మ‌హేశ్‌బాబు ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. బాలికలపట్ల సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషిచేద్దామని పిలుపునిచ్చారు. విద్యావకాశాలు కల్పించాలన్నారు. సాధికారత వైపు అడుగులేస్తూ వృద్ధి చెందేలా వికసించనీయాలన్నారు.పులిపిరికాయ‌ల‌ను త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

Thu,January 24, 2019 03:02 PM

6 home remedies for warts

మ‌నలో అధికశాతం మందికి పులిపిరికాయ‌లు ఉంటాయి. నిజానికి ఇది చాలా సాధార‌ణ స‌మ‌స్య‌గానే చెప్ప‌వ‌చ్చు. పులిపిరి కాయ‌ల‌ను ఉలిపిరి కాయ‌ల‌ని, వార్ట్స్ అని పిలుస్తారు. ఇవి హ్యూమన్ పాపిలోమా వైరస్ కార‌ణంగా వ‌స్తాయి. ఎక్కువ‌గా యుక్త వ‌య‌స్సులో ఉండే వారికే పులిపిరి కాయ‌లు వ‌స్తుంటాయి. అయితే పురుషుల కంటే స్త్రీల‌లోనే ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. పులిపిరి కాయ‌లు చూసేందుకు చర్మపురంగులో కానీ, ముదురు గోధుమ రంగులో కానీ బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. అయితే ఇవి నొప్పిని మాత్రం కలిగించవు. కానీ ఒత్తిడి పడేచోట ఇవి వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లో వస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే పులిపిరులను త‌గ్గించుకోవాలంటే అందుకు మ‌న‌కు అందుబాటులో ఉన్న చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వెల్లుల్లి రెబ్బ‌లను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణాల వల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి.

2. ఉల్లిపాయను సగానికి కోసం మధ్యభాగాన్ని స్పూన్‌తో తొలగించి సముద్రపు ఉప్పుతో అందులో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దాన్ని తీసి నిల్వ‌ చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన రాస్తుంటే ఫ‌లితం ఉంటుంది.

3. పులిపిరులకు ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పులిపిరి కాయ‌లు త‌గ్గుతాయి.

4. ఉత్తరేణి మొక్క ఆకుల‌ను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన రాయాలి. త‌ర‌చూ రాస్తుంటే పులిపిరులు త‌గ్గుతాయి.

5. కొత్త సున్నాన్ని పులిపిరులపైన రాస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టు ప‌క్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు వస్తాయి.

6. విటమిన్-ఎ, విటమిన్-సి ఉన్న ప‌దార్థాలను పైపూతగా రాస్తుంటే పులిపిరికాయలు త‌గ్గుతాయి.

చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Thu,January 24, 2019 03:02 PM

thieves gang arrested by Ramagundam Police

పెద్దపల్లి : రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురు సభ్యుల ముఠా నుంచి 2 పంచలోహ విగ్రహాలు, 30 తులాల బంగారు నగలు, రూ. 10,200లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అక్కడ ఒక్క టెర్రరిస్టూ లేడు.. అందరినీ ఏరేశారు!

Thu,January 24, 2019 03:00 PM

Baramulla is the first Jammu and Kashmir District to have no surviving Terrorist

బారాముల్లా: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా. ఒకప్పుడు ఇది ఉగ్రవాదుల అడ్డా. కానీ ఇప్పుడక్కడ ఒక్కడూ లేడు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తాయిబా టెర్రరిస్టులను కాల్చి చంపడంతో బారాముల్లా జిల్లాలో ఇక ఒక్క ఉగ్రవాది కూడా లేడు అని ఆయన తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాది లేని తొలి జిల్లాగా బారాముల్లా నిలిచింది. బారాముల్లాలోని బిన్నెర్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఆపరేషన్‌లో సుహైబ్ ఫరూక్ అఖూన్, మోహసిన్ ముష్తాక్ భట్, నాసిర్ అహ్మద్ దర్జీ అనే ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. మొదట ఆ ముగ్గురు ఉగ్రవాదులే కాల్పులు ప్రారంభించగా.. జవాన్లు దీటుగా స్పందించారు. బారాముల్లా ఉగ్రవాదులకు అడ్డాగా ఉండేది. 2018లోనే జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 22 జిల్లాలకుగాను 12 జిల్లాల్లో 256 మంది మిలిటెంట్లను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అందులో దక్షిణ కశ్మీర్‌లోనే అత్యధికంగా 127 మంది ఉన్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు ప్రధాన స్థావరమైన షోపియాన్‌లోనే 43 మంది ఉగ్రవాదులను హతమార్చారు.


జియో ఫోన్ యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు..!

Thu,January 24, 2019 02:50 PM

Reliance Jio launches Rs 594 and Rs 297 plans for jio phone users

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న జియో ఫోన్ వినియోగ‌దారుల కోసం రెండు నూత‌న ప్లాన్ల‌న ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. రూ.594, రూ.297 ప్లాన్ల‌ను జియో ఫోన్ యూజ‌ర్లు ఇప్పుడు ఉప‌యోగించుకోవ‌చ్చు. రెండు ప్లాన్ల‌లోనూ వినియోగ‌దారుల‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 500 ఎంబీ డేటా, నెల‌కు 300 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. అలాగే జియో యాప్స్‌కు కాంప్లిమెంట‌రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా వ‌స్తుంది. ఇక రూ.297 ప్యాక్ వాలిడిటీ 84 రోజులు ఉండ‌గా, రూ.594 ప్యాక్ వాలిడిటీ 168 రోజులుగా ఉంది.

చిత్తాపూర్ వ‌ర‌కు తాండూరు మెమూ రైలు

Thu,January 24, 2019 01:52 PM

Indian Railways announces extension of 22 train servicesహైద‌రాబాద్ : దేశ‌వ్యాప్తంగా 22 రైళ్లను పొడిగించారు. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ ప్రాంతంలో ప్ర‌యాణించే రెండు రైళ్లు కూడా అందులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి తాండూర్ వ‌ర‌కు వెళ్లే మెమూ రైలును ఇప్పుడు క‌ర్నాట‌క‌లోని చిత్తాపూర్ వ‌ర‌కు పొడిగించారు. 67249/67250 రైలు ఇప్పుడు మంత‌ట్టి, న‌వాంద‌గి, కురుగుంట‌, సీర‌మ్‌, మ‌ల్కైద్ రోడ్డు స్టేష‌న్ల‌లో ఆగ‌నున్న‌ది. ఇక మిర్యాల‌గూడ నుంచి కాచికూడ మ‌ధ్య న‌డిచే డెమో రైలును ఇప్పుడు న‌డికుడి వ‌ర‌కు పొడ‌గించారు. 77673/77674 నంబ‌ర్ డెమో రైలు ఇక నుంచి కొండ్ర‌పోలు, విష్ణుపురం, పొడుగుల స్టేష‌న్ల‌లో ఆగ‌నున్న‌ది.

కంగుతిన్న రైతు.. రూ. 13 మాత్రమే రుణమాఫీ

Thu,January 24, 2019 01:50 PM

Madhya Pradesh farmer shocked to get Rs 13 instead of Rs 24000 loan waiver

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్.. రైతురుణ మాఫీ కోసం ఇటీవలే దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.

అయితే రైతు శివలాల్ కటారియా తనకున్న మొత్తం రుణం రూ. 23,815 మాఫీ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ కటారియాకు మాత్రం కేవలం రూ. 13 మాత్రమే రుణమాఫీ చేసినట్లు అధికారులు చెప్పారు. దీంతో కంగుతిన్న రైతు అధికారులను ప్రశ్నించాడు. రైతు రుణమాఫీ ప్రకటించిన తేదీ నాటికి కటారియా పేరు మీద కేవలం రూ. 13 మాత్రమే రుణం ఉందని అధికారులు తెలిపారు. అధికారుల సమాధానం విని కటారియా ఆశ్చర్యపోయాడు. రైతుల రుణమాఫీకి సంబంధించి చాలా అవకతవకలు జరుగుతున్నాయని కటారియా ఆరోపించాడు. రైతు రుణమాఫీ పథకం కింద మధ్యప్రదేశ్‌లోని 55 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

అమెరికాలో అత్యంత ఖరీదైన ఇల్లు ఇది.. ధర ఎంతో తెలుసా?

Thu,January 24, 2019 01:33 PM

This is Americas costliest home bought by Citadel owner Ken Griffin

న్యూయార్క్: సైటాడెల్ కంపెనీ తెలుసు కదా. ఆ కంపెనీ ఓనర్ పేరు కెన్ గ్రిఫిన్. ఈయనకు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఖరీదైన ఇళ్లు కొనడం అలవాటు. ఈ మధ్యే లండన్‌లో కూడా రూ.870 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నాడు. బకింగ్ హామ్ ప్యాలెస్‌కు దగ్గర్లో ఉండే ఈ 20 వేల చదరపు అడుగుల ఇల్లు ఓ ప్యారడైజ్. కానీ ఇప్పుడు దానిని తలదన్నే మరో ఇంటిని అమెరికాలో కొన్నారు కెన్ గ్రిఫిన్. ఇది అమెరికాలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా ఇప్పుడు గుర్తింపు పొందింది. న్యూయార్క్‌లోని 220 సెంట్రల్ పార్క్ సౌత్‌లోని పెంట్ హౌజ్ ఇది. దీని ఖరీదు 23.8 కోట్ల డాలర్లు (సుమారు రూ.1700 కోట్లు).

లండన్‌లో కొన్న ఇంటి కంటే రెట్టింపు ధర చెల్లించి ఈ ఇల్లు కొన్నారు గ్రిఫిన్. న్యూయార్క్‌కు పని మీద వచ్చినప్పుడు ఉండటానికని ఆయన ఈ ఇల్లు కొన్నట్లు సైటాడెల్ ప్రతినిధి వెల్లడించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో తన హాస్టల్ రూమ్‌లో కూర్చొని బాండ్లు అమ్మడం నుంచి మొదలుపెట్టిన గ్రిఫిన్.. ఇప్పుడీ స్థాయికి చేరడం విశేషమే. 1990లో సైటాడెల్‌ను ప్రారంభించారు. 960 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో స్థానం సంపాదించారు. న్యూయార్క్, షికాగోల్లో 50 కోట్ల డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులను గ్రిఫిన్ కొనుగోలు చేశారు.

వెనిజులాలో ముదిరిన సంక్షోభం

Thu,January 24, 2019 01:22 PM

Venezuela crisis: Maduro cuts ties with US

క‌రాక‌స్: వెనిజులాలో సంక్షోభం ముదిరింది. ప్ర‌తిప‌క్ష నేత జువాన్ గవ‌డో తాత్కాలిక దేశాధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించుకున్నారు. అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్ర‌తిప‌క్ష నేత‌కు మ‌ద్ద‌తు తెలిపింది. దేశ‌వ్యాప్తంగా బుధ‌వారం జ‌రిగిన అల్ల‌ర్ల‌లో సుమారు 14 మంది మృతిచెందారు. గ‌త కొన్నేళ్లుగా వెనిజులాలో ఆర్థిక సంక్షోభం నెల‌కొన్న‌ది. ప్రెసిడెంట్ నికోల‌స్ మాడురో దారుణంగా విఫ‌ల‌మైన‌ట్లు ఆ దేశ ప్ర‌తిప‌క్షం ఆరోపించింది. ప్ర‌తిప‌క్ష నేత జువాన్‌కు అమెరికా మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో.. అధ్య‌క్షుడు మాడురో అగ్ర దేశంతో సంబంధాల‌ను క‌ట్ చేశారు. అమెరికా దౌత్య‌వేత్త‌లు దేశం విడిచి వెళ్లాల‌ని 72 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. అయితే దేశంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశ ఆర్మీ మాడురోకే మ‌ద్ద‌తు ఇచ్చింది. మాడురో పాల‌న‌లో ఇంధ‌న సంక్షోభం కూడా ఏర్ప‌డింది. ఆహార‌ప‌దార్ధాలు కూడా సామాన్యుల‌కు అంద‌కుండా పోయాయి. దీంతో చాలా వ‌ర‌కు ప్ర‌జ‌లు దేశం విడిచి వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీ భారీ ఆందోళ‌న చేప‌ట్టింది.

ర‌వితేజ బ‌ర్త్‌డే రోజు అభిమానుల‌కి డ‌బుల్ గిఫ్ట్

Thu,January 24, 2019 01:12 PM

ravi tejA birthday gift for fans

గాల్ టైగ‌ర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ వ‌రుస‌గా రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్ చిత్రాలు చేశాడు. ఇందులో రాజా ది గ్రేట్ చిత్రం మాత్ర‌మే మంచి హిట్ సాధించింది. ఇక రీసెంట్ గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ కూడా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమాపై చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ఈ మూవీకి ‘డిస్కో రాజా’ టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌!

చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న ఈచిత్రం యొక్క టైటిల్ లోగో ను లాంచ్ చేయనున్నారు. ఇక అదే రోజు కంద‌రీగ ఫేం సంతోష్ శ్రీనివాస్‌తో ర‌వితేజ చేయ‌నున్న ప్రాజెక్ట్ వివ‌రాలు కూడా వెల్ల‌డించ‌నున్న‌ట్టు స‌మాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈచిత్రం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘తెరి’ కి రీమేక్ గా తెరకెక్కనుంది.రోడ్డుపైనే గర్భిణి ప్రసవం

Thu,January 24, 2019 01:12 PM

Pregnant Woman Gives Birth On The Roadside in Uttar Pradesh

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ పట్టణంలో నిండు గర్భిణి రోడ్డుపైనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు నిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే గర్భిణిని పరీక్షించిన నర్సులు.. మూడు రోజుల తర్వాత ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నర్సులు నిరాకరించడంతో.. తిరిగి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో రోడ్డుపైనే ప్రసవించింది. కొందరు మహిళలు కలిసి ఆమెకు ప్రసవం చేశారు. నర్సుల నిర్లక్ష్యంతో గర్భిణి రోడ్డుపై ప్రసవించడంతో.. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

అవినీతి ఆరోపణలపై ఎంపీడీవో సస్పెండ్

Thu,January 24, 2019 01:07 PM

tekulapally MPDO suspended

భద్రాద్రి కొత్తగూడెం: అవినీతి ఆరోపణలపై ఓ ఎంపీడీవోను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి ఎంపీడీవోను ఖమ్మం కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో మరుగుదొడ్ల నిర్మాణంలో సదరు ఎంపీడీవో అవినీతికి పాల్పడట్లు ఫిర్యాదు అందింది. జడ్పీ సీఈఓ నివేదిక ఆధారంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ అప్పటి ఎంపీడీవో.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో విజయను సస్పెండ్ చేశారు.

బాలికల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత

Thu,January 24, 2019 12:46 PM

home minister mahamood ali attend in National Girl Child Day

హైదరాబాద్ : ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఇవాళ జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహముద్ అలీ మాట్లాడుతూ.. బాలికల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది అని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్‌ను ఏర్పాటు చేశాం. బాలికల విద్యకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి విద్య వరకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నామని తెలిపారు. బాల్యవివాహాల నిరోధానికి అవగాహన కల్పించామని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. లక్ష ఆర్థికసాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయని స్పష్టం చేశారు. గతంలో పోల్చితే ఆడబిడ్డలపై నేరాలను తగ్గిస్తూ వస్తున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలల ద్వారా పోషకాహారం, నాణ్యమైన విద్య అందిస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు.

రిపబ్లిక్ డే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

Thu,January 24, 2019 12:34 PM

CP Anjani Kumar review on Republic Day

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పరేడ్ మైదానంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ.. 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా 50 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే వీక్షకులు 10 నిమిషాల ముందే మైదానానికి రావాలని సీపీ సూచించారు. పరేడ్ మైదానంలో సైనిక, వాయుసేన, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, పోలీసుల కవాతు నిర్వహించారు.

కోహ్లి సేన కంటే ఈజీగా.. అమ్మాయిలూ గెలిచారు

Thu,January 24, 2019 12:32 PM

Smrithi Mandhana makes another century as Team India beat New Zealand by 9 wickets

నేపియర్: భారత పురుషుల జట్టులాగే మహిళల జట్టు కూడా న్యూజిలాండ్ గడ్డపై బోణీ చేసింది. కోహ్లి సేన కంటే సునాయాసంగా తొలి వన్డే మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట స్పిన్ వలలో కివీస్‌ను విలవిల్లాడించిన టీమిండియా.. తర్వాత ఓపెనర్ స్మృతి మందాన సెంచరీతో టార్గెట్‌ను ఈజీగా చేజ్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ వుమెన్స్ టీమ్.. కేవలం 33 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి చేజ్ చేయడం విశేషం. మందాన వన్డేల్లో నాలుగో సెంచరీ చేసింది. చివరికి విన్నింగ్ షాట్ ఆడబోయి 105 పరుగుల దగ్గర ఔటైంది. మరో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు న్యూజిలాండ్‌ను 192 పరుగులకే టీమిండియా ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్ మూడేసి వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు తీసుకుంది.


మృతదేహాన్ని ముక్కలు చేసి టాయిలెట్‌లో పడేశాడు..

Thu,January 24, 2019 12:24 PM

Man Kills Friend Flushes Chopped Body Down The Toilet Near Mumbai

ముంబై : అప్పు తీర్చడం లేదని ఓ వ్యక్తిని మరో వ్యక్తి కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి టాయిలెట్‌లో పడేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని బచ్‌రాజ్ పారడైజ్ సోసైటీలో జనవరి 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పింటూ అనే వ్యక్తి వద్ద గణేష్ విఠల్(58) లక్ష రూపాయాలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పును గణేష్ తీర్చలేకపోయాడు. దీంతో ఇరువురి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే జనవరి 16న పింటూ.. గణేష్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం గణేష్‌ను పింటూ దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. తన ఇంటిలోని టాయిలెట్‌లో నాలుగు రోజుల పాటు ఆ ముక్కలను పడేసి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అయితే మున్సిపల్ కార్మికులు స్థానికంగా ఉన్న డ్రైనేజీని శుభ్రపరుస్తుండగా మానవ మృతదేహం ముక్కలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు పింటూను అరెస్టు చేశారు.

జ‌స్టిస్ సిక్రీ కూడా త‌ప్పుకున్నారు..

Thu,January 24, 2019 12:20 PM

Justice Sikri exits case on Interim CBI Chief Nageshwar Raos appointment

న్యూఢిల్లీ: మొన్న సీజేఐ రంజ‌న్ గ‌గోయ్‌, ఇవాళ జ‌స్టిస్ ఏకే సిక్రీ .. సీబీఐ కేసు నుంచి త‌ప్పుకున్నారు. సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వ‌ర్‌రావును ఎలా నియ‌మించార‌ని వేసిన పిటీష‌న్‌ను విచారించే ధ‌ర్మాస‌నం నుంచి తాను కూడా త‌ప్పుకుంటున్న‌ట్లు ఇవాళ జ‌స్టిస్ ఏకే సిక్రీ తెలిపారు. సీబీఐ చీఫ్ సెలెక్ష‌న్ టీమ్‌లో ఉన్న కార‌ణంగా తాను త‌ప్పుకుంటున్న‌ట్లు సీజేఐ గ‌గోయ్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. మాజీ చీఫ్ అలోక్ వ‌ర్మ‌ను తొల‌గించిన త‌ర్వాత సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వ‌ర్‌రావును నియ‌మించారు. ఆ నియామ‌కాన్ని స‌వాల్ చేస్తూ కామ‌న్ కాజ్ అనే సంస్థ పిటిష‌న్ వేసింది. కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను, అందుకే దాని గురించి మాట్లాడ‌లేమ‌ని జ‌స్టిస్ సిక్రీ అన్నారు. పిల్‌లో కొన్ని ముఖ్య అంశాల‌ను లేవ‌నెత్తార‌న్న‌ విష‌యం త‌న‌కు తెలుస‌న్నారు.

ఆ నలుగురిలో చిరుతో జోడి క‌ట్టే భామ ఎవ‌రు ?

Thu,January 24, 2019 12:00 PM

vidya balan pairs with chiru in 152 movie

తొమ్మిదేళ్ళ త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్ర‌స్తుతం సైరా అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. పీరియాడిక‌ల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం త‌ర్వాత చిరు .. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సామాజిక నేప‌థ్యంతో సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి కాగా, ప్రీ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇందులో క‌థానాయిక‌గా న‌లుగురు భామ‌ల‌ని ప‌రిశీలించింద‌ట చిత్ర బృందం. విద్యా బాల‌న్‌, త్రిష‌, న‌య‌న తార‌, త‌మన్నాల‌లో ఒక‌రిని ఎంపిక చేస్తార‌ని అంటున్నారు. న‌య‌న‌తార ప్ర‌స్తుతం చిరుతో సైరా సినిమా చేస్తుండ‌గా, త్రిష స్టాలిన్ అనే చిత్రంలో చిరుతో జోడి క‌ట్టింది. ఇక త‌మ‌న్నా కూడా సైరాలో న‌టిస్తుంది. ఈ నేప‌థ్యంలో కొత్త ద‌నం కోసం విద్యాబాల‌న్‌నే సెల‌క్ట్ చేస్తారని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

రాహుల్ ఇటలీకి వెళ్లిపో.. రైతుల నిరసన

Thu,January 24, 2019 11:56 AM

Rahul Gandhi Go Back To Italy Farmers Protest in Amethi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తీవ్ర నిరసన ఎదురైంది. అమేథి జిల్లాలోని గురిగంజ్ పట్టణంలో రాహుల్ పర్యటన కొనసాగిస్తుండగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ ఇటలీకి వెళ్లిపోవాలంటూ రైతులు నినదించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం లాక్కున్న భూమిని తమకు తిరిగి ఇవ్వాలి. లేదా ఉపాధి చూపించాలి అని రైతులు డిమాండ్ చేశారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలని రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ రైతు మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పని విధానంతో తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని తెలిపారు. ఆయన తప్పకుండా ఇటలీకి వెళ్లిపోవాలి. తమ కోరికలను రాహుల్ నెరవేర్చడం లేదన్న రైతు.. తమ భూములను రాహుల్ లాక్కున్నాడని ఆరోపించాడు.

వీడియోకాన్ ఆఫీసుల‌పై సీబీఐ దాడులు

Thu,January 24, 2019 11:51 AM

CBI raids Videocon office in case linked to ICICI loans

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ చీఫ్ చందా కొచ్చార్ భ‌ర్త దీప‌క్ కొచ్చార్‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. అక్ర‌మ ప‌ద్ద‌తిలో ఐసీఐసీఐ బ్యాంకు రుణాలు ఇచ్చిన స్కామ్‌లో ఈ కేసు న‌మోదు చేశారు. ఇదే కేసుకు సంబంధం ఉన్న వీడియోకాన్ అధిప‌తి వేణుగోపాల్ ధూత్ ఆఫీసులోనూ సీబీఐ ఇవాళ సోదాలు నిర్వ‌హిస్తోంది. ముంబైలోని వీడియోకాన్ హెడ్‌క్వార్ట‌ర్స్‌తో పాటు ఇత‌ర న‌గ‌రాల్లో ఉన్న ఆఫీసుల్లో సోదాలు జ‌రుగుతున్నాయి. గ‌త అక్టోబ‌ర్‌లో ఈ కేసుకు సంబంధం ఉన్న చందా కొచ్చార్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. 2012లో వీడియోకాన్ గ్రూపుకు ఐసీఐసీఐ బ్యాంకు సుమారు 3250 కోట్ల రుణాన్ని ఇచ్చింది. అయితే ఆ రుణ ఒప్పందంలో చందా కొచ్చార్ కుటుంబం స‌భ్యులు ముడుపులు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చందా భ‌ర్త దీప‌క్ కొచ్చార్ .. వీడియోకాన్ అధినేత స్థాపించిన నూప‌వ‌ర్ రినివ‌బుల్స్‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అయితే చందా కొచ్చార్‌పై విచార‌ణకు బ్యాంకు అంగీక‌రించ‌డంతో ఆమె సీఈవో ప‌ద‌వికి రాజీనామా చేశారు.

100 గుడిసెలు దగ్ధం : చిన్నారి సజీవదహనం

Thu,January 24, 2019 11:43 AM

100 shanties gutted in a fire which broke out in Gurugram

హర్యానా : గురుగ్రామ్‌లోని నాథూపూర్ ఏరియాలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 100 గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ఏడు నెలల చిన్నారి సజీవదహనమైంది. ఘటనాస్థలికి చేరుకున్న ఆరు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబాలు కట్టుబట్టులతో రోడ్డున పడ్డాయి.

వివాదంలో మ‌ణికర్ణిక‌.. క్ష‌మాప‌ణ చెప్ప‌నంటున్న కంగ‌నా

Thu,January 24, 2019 11:38 AM

Kangana Ranaut CONTROVERSIAL COMMENTS

కంగ‌నా ర‌నౌత్‌.. ఈ పేరుకి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎక్కువ వివాదాల‌తోనే వార్త‌ల‌లో నిలిచే ఈ అమ్మ‌డు శుక్ర‌వారం మ‌ణిక‌ర్ణిక చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఝాన్సీ ల‌క్ష్మీ బాయి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్‌ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా తెర‌కెక్కించారు. చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీబాయిని త‌ప్పుగా చూపించారంటూ హిందూ క‌ర్ణిసేన ఆందోళ‌న‌కి దిగారు. సినిమా విడుద‌ల‌ని ఆపాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో ల‌క్ష్మీ భాయ్‌ని అగౌర‌వ‌ప‌రిచేలా ఏ ఒక్క సీన్ ఉన్నా కూడా కంగ‌నా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంద‌ని క‌ర్ణిసేన హెచ్చ‌రిస్తుంది.

క‌ర్ణిసేన హెచ్చరిక‌ల‌పై స్పందించిన కంగ‌నా ర‌నౌత్‌.. నేను రాజ్‌పుత్‌నే. ఎవ‌రికి భ‌య‌ప‌డేది లేదు. బెదిరింపుల‌కి పాల్ప‌డితే క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌ల‌ని నాశనం చేస్తాను అని హెచ్చ‌రించింది. అయితే కంగ‌నా ఇలానే మాట్లాడ‌డం కొన‌సాగిస్తే ఆమెని మహ‌రాష్ట్ర‌లో తిర‌గ‌నివ్వ‌మ‌ని క‌ర్ణిసేన అంటుంది. సినిమాలో ల‌క్ష్మీభాయ్ గురించి త‌ప్పుగా చూపించ‌లేదు. ఆమె నా బంధువు కాదు. భార‌త‌దేశ ముద్ధుబిడ్డ‌. అలాంట‌ప్పుడు ఆమె గురించి త‌ప్పుగా ఎలా చూపిస్తామ‌ని కంగనా అంటుంది.మ‌రోవైపు క‌ర్ణిసేన బెదిరింపుల‌తో కంగ‌నా ఇంటి ద‌గ్గ‌ర భారీ భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు పోలీసులు. మ‌ణికర్ణిక చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా 50 దేశాల‌లో విడుద‌ల కానుంది.

మల్లేపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవం

Thu,January 24, 2019 11:35 AM

Dodla Anjilaiah unanimously elected as Mallepalli Sarpanch

వికారాబాద్ : దోమ మండలంలోని మల్లేపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఎస్సీ అభ్యర్థి దొడ్ల అంజలయ్యను సర్పంచ్‌గా గ్రామస్తులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంజలయ్య గతంలో కూడా సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. సింగిల్ విండో మెంబర్‌గా కూడా పని చేశాడు. నిన్న పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అంజలయ్య కలిశారు. ఈ సందర్భంగా అంజలయ్యకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ శ్రేణులు, మల్లేపల్లి గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నాగ‌ర్‌క‌ర్నూల్‌లో మహిళ దారుణహత్య

Thu,January 24, 2019 11:11 AM

Woman murdered in nagar kurnool

నాగ‌ర్‌క‌ర్నూల్‌: ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఈ విషాద సంఘటన నాగ‌ర్‌క‌ర్నూల్‌ ఎర్రగడ్డ కాలనీలో చోటుచేసుకుంది. లక్ష్మమ్మ అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు. కాగా మతిస్థిమితం లేని కుమారుడే చంపి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పాఠశాల సంపులో పడి విద్యార్థి మృతి

Thu,January 24, 2019 10:49 AM

student died in Karimnagar paaramita school

కరీంనగర్: జిల్లా కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పారామిత పాఠశాలలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాలలోని సంపులో పడి 9వ తరగతి విద్యార్థి అశ్విన్ మృతిచెందాడు. పాఠశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని తరలించింది. విద్యార్థి కుటుంబీకులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు మోహరించారు.

విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా

Thu,January 24, 2019 10:39 AM

students injured in auto roll at Janagama

జనగామ: విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం జనగామ మండలం శామీర్‌పేట‌ వద్ద చోటుచేసుకుంది. కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం జనగామ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

జ‌వానైన ఉగ్ర‌వాది.. ఇప్పుడ‌త‌నికి మ‌ర‌ణానంత‌రం అశోక చ‌క్ర‌

Thu,January 24, 2019 10:39 AM

Terrorist turned soldier Lance Naik Nazir Ahmed Wani to be conferred Ashoka Chakra posthumously, informs Presidents Secretariat

న్యూఢిల్లీ : ద‌క్షిణ క‌శ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో ఉగ్ర‌వాదుల‌తో పోరాడి ప్రాణాలు అర్పించిన లాన్స్ నాయ‌క్ న‌జీర్ అహ్మ‌ద్ వానికి ఈ ఏడాది అశోక్ చ‌క్ర అవార్డును ప్ర‌దానం చేయ‌నున్నారు. ఉగ్ర‌వాదుల‌తో విరోచితంగా పోరాడిన న‌జీర్‌కు మ‌ర‌ణాణంత‌రం ఈ అవార్డును ఇవ్వ‌నున్నారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు ఈ అవార్డును స్వీక‌రించ‌నున్నారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌తో ఎన్‌కౌంట‌ర్ జ‌రుగుతున్న స‌మ‌యంలో న‌జీర్ త‌న వీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చ‌డంలో స‌హ‌క‌రించాడు. ఆ త‌ర్వాత గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను సుర‌క్షిత ప్రాంతానికి చేర్చ‌డంలోనూ సాయం చేశాడు. అందుకే ఆర్మీలోని అత్యున్న‌త అవార్డును ఇస్తున్న‌ట్లు రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. వాస్త‌వానికి న‌జీర్ అహ్మ‌ద్ వాని ఒక‌ప్పుడు ఉగ్ర‌వాదిగానే ఉన్నాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల అత‌ను ఆర్మీ ముందు లొంగిపోయాడు. ఆ త‌ర్వాత క‌శ్మీర్ వ్యాలీలో ఉగ్ర‌వాదుల నిర్మూల‌న‌కు అత‌ను స‌హ‌క‌రించాడు. టెరిటోరియ‌ల్ ఆర్మీలోని 162వ బెటాలియ‌న్‌లో 2004లో న‌జీర్ అహ్మ‌ద్ వాని చేరాడు. కౌంట‌ర్ ఇన్‌స‌ర్జెన్సీ ఆప‌రేష‌న్స్‌లో పాల్గొన్నాడ‌త‌ను. కుల్గామ్‌కు చెందిన అత‌ను సేనా మెడ‌ల్‌ను రెండుసార్లు నెగ్గాడు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఎన్‌కౌంట‌ర్‌లో ఆరుగురు ఉగ్ర‌వాదులు కూడా హ‌త‌మ‌య్యారు. ఆయ‌న‌కు భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్‌కి స్ట్రైట్ ఎంట్రీ

Thu,January 24, 2019 10:37 AM

Samuthirakani to play an important role in RRR

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత‌ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం తొలిషెడ్యూల్ పూర్తి చేసుకోగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో రెండో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ చిత్రంలో పాత్ర‌ల‌కి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానులకి అమితానందాన్ని క‌లిగిస్తున్నాయి. క‌థానాయిక‌లుగా కీర్తి సురేష్‌, ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు రాగా, ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని .. చరణ్ కు బాబాయ్ గా నటించనున్నాడని అన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌ముద్ర‌ఖ‌ని ఆర్ఆర్ఆర్‌లో న‌టించ‌డం క‌న్‌ఫాం అని అంటున్నారు. అయితే పాత్ర ఏంట‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కోలీవుడ్ లో ఫేమస్ అయిన ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఈ చిత్రంతో తెలుగులోకి స్ట్రైయిట్ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది. కీరవాణి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.ప్యాంట్లు కాదు చీర కట్టుకోండి..

Thu,January 24, 2019 10:29 AM

Wear Saree, Not Pants says BJP Leader Moushumi Chatterjee

న్యూఢిల్లీ: ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మౌషిమి ఛటర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.. సూరత్ హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె యాంకర్(వ్యాఖ్యాత)ను ఉద్దేశిస్తూ.. మీరు ధరించిన దుస్తులు సరియైనవిగా లేవు. చీర గానీ సల్వార్ కమీజ్ గానీ ధరిస్తే మంచిదన్నారు. వస్త్రధారణ విషయంలో ఛటర్జీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంపై మీడియా ఆమెను ప్రశ్నించగా తన చర్యను సమర్థించుకున్నారు. ఆమెకు ఓ తల్లి మాదిరి సలహా పూర్వకంగా మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. తన మాటలను అపార్థం చేసుకోవద్దని అప్పుడే చెప్పినట్లు పేర్కొన్నారు. ఎప్పుడూ, ఎక్కడ ఏం ధరించాలని యువతకు చెప్పే హక్కు తనకుందన్నారు. బీజేపీ నాయకురాలి వ్యాఖ్యలపై స్పందించేందుకు సదరు యాంకర్ నిరాకరించారు.

ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ పిల్ల‌లు ఉంటే ఓటు హ‌క్కు ర‌ద్దు చేయండి..

Thu,January 24, 2019 10:11 AM

Take away voting rights of people with more than two kids, says Yoga Guru Ramdev

అలీఘ‌డ్: ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ మంది పిల్ల‌లు ఉన్న‌వారికి ఓటింగ్ హ‌క్కును ర‌ద్దు చేయాల‌ని యోగా గురువు రామ్ దేవ్ బాబా అన్నారు. అలీఘ‌డ్‌లో ప‌తంజ‌లి స్టోర్‌ను ప్రారంభించిన త‌ర్వాత మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ పిల్ల‌లు ఉన్న వారు ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా చూడాల‌న్నారు. ప్ర‌భుత్వ స్కూళ్లు వాడ‌కుండా చేయాల‌ని, హాస్ప‌ట‌ళ్లను కూడా వినియోగించ‌కుండా చూడాల‌ని, ప్ర‌భుత్వ ఉద్యోగాలు కూడా వాళ్ల‌కు రాకుండా చేయాల‌ని బాబా రామ్‌దేవ్ అన్నారు. భార‌త్‌లో జ‌నాభా శ‌ర‌వేగంగా పెరుగుతోంద‌ని, ఆ జ‌నాభాను అదుపు చేయాలంటే, ఇలాంటి నియమాలు అవ‌స‌రం అని ఆయ‌న అన్నారు. హిందువులైనా, ముస్లింలు అయినా అంద‌రికీ ఇదే వ‌ర్తించాల‌న్నారు. అలా అయితేనే జ‌నాభా అదుపులో ఉంటుంద‌న్నారు.

శున‌కం జాకెట్ ఖ‌రీదు రూ.అక్షరాలా 36 ల‌క్ష‌లు

Thu,January 24, 2019 10:04 AM

Priyanka gets Rs3.6 million jacket for her dog

దాదాపు సెల‌బ్రిటీలందరి ఇళ్ళ‌ల‌లో పెంపుడు జంతువులుండ‌డం స‌హ‌జం. అయితే కొంద‌రు సెల‌బ్రిటీస్ మాత్రం పెంపుడు జంతువుల విష‌యంలో కాస్త వినూత్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. మ‌నుషుల క‌న్నా వాటినే ఎక్కువ‌గా ప్రేమిస్తూ అందరిని ఆశ్చర్య‌పరుస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రా త‌న పెంపుడు శున‌కానికి 36 ల‌క్ష‌ల రూపాయ‌ల జాకెట్ వేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. షూటింగ్ నిమిత్తం ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ఈ అమ్మ‌డు త‌న శున‌కాన్ని కూడా అక్క‌డికి తీసుకెళ్లింది. చల్ల‌ద‌నం అక్క‌డ ఎక్కువ ఉండ‌డంతో ఆ శున‌కానికి జాకెట్ వేసి, ఫోటోలు తీసింది. అంత‌టితో ఆగ‌కుండా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఇంత చక్కటి జాకెట్‌ ఇచ్చినందుకు మోన్‌క్లేర్‌కు (బ్రాండ్‌) ధన్యవాదాలు అని కామెంట్ పెట్టింది.

కుక్క‌కి అంత కాస్ట్‌లీ జాకెట్ వేయ‌డంతో నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తుంది ప్రియాంక‌. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఆమె న‌టిస్తున్న‌ హాలీవుడ్ చిత్రం ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ విడుద‌ల‌కి సిద్ధం కాగా, ఏ కిడ్ లైక్ జేక్ చిత్రం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో యూట్యూబ్‌ వేదికగా ‘ఇఫ్‌ ఐ కుడ్‌ టెల్‌ యూ జస్ట్‌ వన్‌ థింగ్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లోని స్ఫూర్తిదాయక వ్యక్తులతో సంభాషించనున్నారు.


బ్యాంక్‌లో అయిదుగుర్ని కాల్చి చంపేశాడు..

Thu,January 24, 2019 09:29 AM

shooting in SunTrust Bank, five killed in Florida

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. సెబ్రింగ్ ప‌ట్ట‌ణంలో ఉన్న స‌న్ ట్ర‌స్టు బ్యాంక్‌లో ఓ సాయుధుడు అయిదుగుర్ని కాల్చి చంపాడు. ఆ విష‌యాన్ని అత‌నే పోలీసుల‌కు ఫోన్ చేసి చెప్పాడు. అయితే అక్క‌డ‌కు వ‌చ్చిన స్వాట్ పోలీసులు అత‌న్ని అరెస్టు చేశాయి. బ్యాంక్‌లో అయిదుగుర్ని కాల్చి చంపిన వ్య‌క్తిని 21 ఏళ్ల జీఫెన్ జేవ‌ర్‌గా గుర్తించారు. పోలీసులు ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘ‌ట‌న స‌మ‌యంలో బ్యాంక్‌లో అయిదుగురు మాత్ర‌మే ఉన్న‌ట్లు తేలింది. బ్యాంక్‌లోకి గ‌న్‌తో వెళ్లిన జేవ‌ర్‌.. అక్క‌డ ఉన్న వారిని నేల‌పై ప‌డుకోమ‌న్నాడు. ఆ త‌ర్వాత ఆ అయిదుగుర్ని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపాడు. క్రైమ్ జ‌రిగిన బ్యాంక్‌కు పోలీసులు చేరుకోగానే.. అత‌ను వాళ్ల‌కు లొంగిపోయాడు. ఆ నిందితుడు వీడియోను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఒర్లాండో న‌గ‌రానికి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ విషాద ఘ‌ట‌న ప‌ట్ల దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌న్‌ట్ర‌స్టు బ్యాంక్ త‌న ట్వీట్‌లో వెల్లడించింది. ఉన్మాది జేవ‌ర్ గ‌తంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అయితే ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా అత‌న్ని ఆ ఉద్యోగం నుంచి తొల‌గించారు.గాయాన్ని లెక్క చేయ‌కుండా షూటింగ్‌లో పాల్గొన్న హ‌న్సిక‌

Thu,January 24, 2019 09:13 AM

hansika injured in shooting

అందాల క‌థానాయిక హన్సిక ప్ర‌స్తుతం త‌న 50వ చిత్రం మ‌హాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు జమీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌క్కుతున్న ఈ చిత్రం థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతుంది. చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ అభిమానులు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ యాక్ష‌న్ సీన్‌ని షూట్ చేస్తుండ‌గా, అనుకోకుండా హ‌న్సిక కాలు జారిప‌డిపోవ‌డంతో ఆమె చేతికి బాగా గాయాల‌య్యాయ‌ట‌. రక్తం కూడా చాలా పోయింద‌ట‌. షూటింగ్ ఆపేసి ఆసుప‌త్రికి వెళ‌దామ‌ని చిత్ర యూనిట్ ఎంత‌గా చెప్పిన‌, చేతికి బ్యాండేజ్ వేసుకొని త‌న పార్ట్ షూటింగ్ పూర్తయ్యాకే ఇంటి వెళ్ళింద‌ట హ‌న్సిక‌. ఆమె డెడికేష‌న్ చూసిన యూనిట్ సభ్యులు హన్సికపై ప్ర‌శంస‌లు కురిపించ‌కుండా ఉండలేక‌పోతున్నారు. హ‌న్సిక న‌టిస్తున్న మ‌హా చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Thu,January 24, 2019 09:13 AM

Devotees normal in Tirumala

తిరుమల: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. టైంస్లాట్ ఉచిత దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని 61,305 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,530 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.70 కోట్ల ఆదాయం సమకూరింది.

కూలిన నాలుగు అంత‌స్తుల బిల్డింగ్‌.. శిథిలాల కింద 12 మంది

Thu,January 24, 2019 09:10 AM

Four storey building collapsed in Haryana, 12 trapped under rubles

గురుగ్రామ్ : హ‌రియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఓ నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం కూలింది. ఇవాళ ఉద‌యం 5 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బిల్డింగ్ శిథిలాల కింద సుమారు 12 మంది చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల‌ను తొల‌గిస్తున్నాయి. హ‌రియాణా ఫైర్ స‌ర్వీస్‌కు చెందిన సిబ్బంది కూడా స‌హాయ కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఉల్ల‌వాస్ ప్రాంతంలో బిల్డింగ్ కూలింది. అయితే బిల్డింగ్ కూల‌డానికి కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. ప్ర‌ఖ్యాత సైబ‌ర్ హ‌బ్ ప్రాంతానికి 12 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

విద్యార్థినిని మోసం చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

Thu,January 24, 2019 09:09 AM

OU Assistant Professor cheating student name of marriage

ఉస్మానియా యూనివర్సిటీ : విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులుగా మార్చాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్... విద్యార్థినిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనను పెండ్లి చేసుకుంటానని చెబుతూ, సహజీవనం చేసి మోసం చేసాడంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో చోటు చేసుకుంది. ఓయూ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం ... ఇఫ్లూలో బాధిత విద్యార్థిని ఎంఏ (ఇంగ్లీష్) రెండో సంవత్సరం చదువుతున్నది. ఆమెకు ఇఫ్లూలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రంజిత్ తంగప్పన్ (40) పరిచయమయ్యాడు. అతను సీతాఫల్‌మండిలో నివసిస్తున్నాడు.

భార్యతో తనకు మనస్పర్థలు వచ్చాయని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నానంటూ బాధితురాలికి దగ్గరయ్యాడు. తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నానని, తనకు తోడు అవసరమని చెబుతూ బాధిత విద్యార్థినిని పెండ్లి చేసుకుంటానని చెబుతూ, హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిని అక్కడి నుంచి ఖాళీ చేయించి, తన ఇంటిలో కలిసి నివసించసాగారు. ఇలా సాగుతున్న క్రమంలో అకస్మాత్తుగా ఈ నెల 12న బాధితురాలిపై చేయిచేసుకుని, పెండ్లి చేసుకోవడం కుదరదని, హాస్టల్‌కు వెళ్లిపోవాలని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఆమె నుంచి ఫోన్లు కూడా రాకుండా ఆమె నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాడు. ఈ నెల 19 నుంచి యూనివర్సిటీలో వారం పాటు సెలవు పెట్టి వెళ్లిపోయాడు. ఎంత ప్రయత్నించినా ఫోన్ కలవకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం దవాఖానకు పంపిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపా రు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నగరం చుట్టూ బస్ టెర్మినల్స్

Thu,January 24, 2019 09:05 AM

Bus terminals around hyderabad city

హైదరాబాద్ : నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేసేందుకు ఆర్టీసీ తనవంతు ప్రయత్నాన్ని చేపట్టింది. జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఇన్నర్ రింగ్‌రోడ్డు అవతలి నుంచే తిప్పి పంపేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని బస్‌టెర్మినల్స్ నిర్మించి అక్కడి నుంచే ఆపరేటింగ్ చేయాలని ఆర్టీసీ భావిస్తున్నది. దీనికోసం టీఎస్‌ఆర్టీసీ నగరంలో స్థలాలను అన్వేషిస్తున్నది. అయితే అంతర్రాష్ట్ర సర్వీసులకు మాత్రం ఎంజీబీఎస్, జేబీఎస్ స్టేషన్ల వరకు అనుమతించి జిల్లా కేంద్రాలు, రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే బస్సులను శివార్లకే పరిమితం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరంగల్ రహదారి మార్గంలో ఉప్పల్ ఎక్స్‌రోడ్డు, విజయవాడ, నల్గొండ మార్గంలో ఎల్బీనగర్ వద్ద, బెంగళూరు మార్గంలో ఆరాంఘర్ చౌరస్తా, ముంబై మార్గంలో మియాపూర్, కరీంనగర్ మార్గంలో జేబీఎస్ బస్టాండ్ వద్ద కొత్త టెర్మినల్స్ నిర్మించనున్నారు. అయితే ఈ టెర్మినల్స్ వద్దనే జిల్లాల నుంచి వచ్చే బస్సులు ప్రయాణికులను దింపివేస్తాయి.

అక్కడి నుంచే జిల్లాలకు తీసుకెళ్తారు. అయితే బస్సు దిగిన తర్వాత తమ గమ్యస్థానాలకు చేరేవరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. సూపర్‌లగ్జరీ, రాజధాని ఏసీ, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణించిన బస్సు టిక్కెట్ సిటీ బస్సులో కూడా చెల్లుతుంది. అయితే నిర్ణీత సమయంలోగా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూపర్‌లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తే అదే బస్సు టికెట్ సిటీ బస్సుల్లో గంట సమయం వరకు చెల్లే అవకాశం ఉన్నది. ఇదే విధానాన్ని అమలు చేస్తారా?సమయాన్ని ఏమైనా మార్పులు చేస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఇప్పటికే ట్రావెల్స్ బస్సుల ఆపరేటింగ్‌ను ఔటర్ రింగ్‌రోడ్డు అవతలకు మార్చాలనే ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నది. అదే విధానంలో టీఎస్ ఆర్టీసీ, తదితర ఆర్టీసీ బస్సులను ఇన్నర్ రింగ్‌రోడ్డు అవతలి నుంచి ఆపరేట్ చేయాలని భావిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రోరైలు కూడా ఉండటంతో దీని ద్వారా నగరం నుంచి ఎక్కడికైనా వెళ్లడానికి అవకాశముంటుంది. నగర ట్రాఫిక్‌పై భారం పడకుండా చూడాలని భావిస్తున్నారు. దీనికోసం స్థలాలను టీఎస్‌ఆర్టీసీ అన్వేశిస్తున్నది. జేబీఎస్‌లో స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఉప్పల్ క్రాస్‌రోడ్డులో సర్వేఆఫ్ ఇండియా ల్యాండ్‌ను కోరినట్లు తెలిపారు. ఈ టెర్మినల్స్ అత్యంత సౌకర్యాలతో లేటెస్ట్ మోడల్‌తో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తే డీపీఆర్ సిద్ధం చేసి నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నట్లు టీఎస్ ఆర్టీసీ సీనియర్ అధికారి తెలిపారు.

మ‌హేష్‌ని డిఫ‌రెంట్ లుక్ లో చూపించ‌నున్న సుకుమార్

Thu,January 24, 2019 09:03 AM

mahesh next movie comes with forest backdrop

లెక్క‌ల మాస్టారు సుకుమార్ వ‌రుస హిట్స్‌తో మాంచి ఫాంలో ఉన్నాడు. రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న సుకుమార్ అదే జోరులో త‌ర్వాతి చిత్రాన్ని కొత్త‌గా తెర‌కెక్కించి మ‌రో హిట్ త‌న కిట్టిలో వేసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. సుకుమార్ త‌ర్వాతి చిత్రం మ‌హేష్‌తో చేయ‌నుండ‌గా మ‌రి కొద్ది రోజుల‌లో ఇది మొద‌లు కానుంది. మ‌హేష్ కోసం సుకుమార్ హిస్టారిక‌ల్ స‌బ్జెక్ట్‌ని రెడీ చేయ‌గా, దానిపై అంత ఇంట్రెస్ట్ చూపించని మ‌హేష్ మ‌రో క‌థ‌ని సిద్దం చేయ‌మ‌న్నాడ‌ట‌. దీంతో సుకుమార్ రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో క‌థ‌ని సిద్దం చేసాడ‌ని అన్నారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం సుకుమార్‌, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా, ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా ఉంటుంద‌ని టాక్. ఇందులో మ‌హేష్‌ని స‌రికొత్త లుక్‌లో చూపించ‌నున్నాడ‌ట సుక్కూ. మ‌రి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. మ‌హేష్ 26వ సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ రూపొందించ‌నున్నారు.

సమృద్ధి ఉత్సవ్ పేరిట ఓలా బైక్ మెగా జాబ్‌మేళా

Thu,January 24, 2019 09:01 AM

Ola bike mega job mela in the name of the abundance of Utsav

హైదరాబాద్ : ఔత్సాహికులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సమృద్ధి ఉత్సవ్ పేరిట ఓలా బైక్ మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నది. మాదాపూర్‌లో కొనసాగనున్న ఓలా ఉత్సవ్ ద్వారా నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో నెలకు 25 రోజులు (10 నుంచి 12 గంటల వరకు) పని చేసి రూ.20వేల నుంచి 32వేల వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. మూడు రోజుల వరకు కొనసాగనున్న ఓలా ఉత్సవ్‌లో ఆసక్తి గల యువత సొంత వాహనముతో రాగలరు. బైక్ లేని వారికి అద్దెకు ఇవ్వబడును. సొంత వాహనము కలిగిన వారు కమర్షియల్ ప్లేట్‌గా మార్చుకునే వీలును కల్పిస్తుంది. ఇందులో భాగంగా పాత బైక్ ఉన్న వారు ఎక్చైంజ్ ఆఫర్‌లో ఇతర బైక్‌ను తీసుకునే వీలును కల్పిస్తుంది. కొత్త బైక్‌ను తీసుకున్న వారికి రూ.15లక్షల వరకు ఇన్సూరెన్స్(బజాజ్)ను కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డైవింగ్ లైసెన్స్, టూవీలర్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పాన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌తో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని శ్రీసాయి గార్డెన్ ఫంక్షన్‌హాల్, హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్‌కోఠి రోడ్డు, శాలీమార్ ఫంక్షన్‌హాల్‌కు రావాలని నిర్వాహకులు తెలిపారు.

కాపురంలో వాట్సాప్ చిచ్చు

Thu,January 24, 2019 08:57 AM

whatsapp create family disputes in hyderabad

హైదరాబాద్ : మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను క్లాస్‌మెట్ అయిన దంపతులకు వాట్సాప్‌లో పంపించి...వేధిస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్‌కు చెందిన మహ్మద్ షోహెబ్ అలీ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. అలాగే స్నేహితురాలు కూడా అక్కడే చదివింది. అనంతరం స్వదేశానికి వచ్చేశారు. ఇక్కడకు వచ్చిన తరువాత బాధితురాలు, అదే కాలేజీలో చదివిన మరో వ్యక్తిని పెండ్లి చేసుకుంది. ఆమెకు ఒక కూతురు. కాగా... షోహెబ్ కాలేజీ సమయంలో బాధితురాలితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశాడు. ఈ క్రమంలో కొత్త నంబర్‌తో చైనాలో ఎంబీబీఎస్ చదివిన వారితో గ్రూప్ తయారు చేశాడు. అందులో బాధితురాలి భర్త కూడా ఉన్నాడు. ఒక రోజు మార్ఫింగ్ చేసిన కొన్ని వీడియోలు, ఫొటోలను అందులో పోస్టు చేశాడు. వాటిని చూసిన బాధితురాలి భర్త షాక్‌కు గురయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన అసలు ఫోన్ నంబర్‌ను కూడా ఆ గ్రూప్‌లో యాడ్ చేశాడు. వాటిని చూసిన భర్త, భార్యను నిలదీయడంతో వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో బాధితురాలి భర్త సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఎల్బీనగర్‌కు చెందిన సోహెబ్‌గా గుర్తించి, అరెస్ట్ చేశారు.

అదృశ్యమైన గృహిణి శవమై తేలింది!

Thu,January 24, 2019 08:54 AM

missing housewife dead in sump hyderabad chandanagar

హైదరాబాద్ : మూడు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ గృహిణి ఇంట్లోని సంపులోనే శవమై కనిపించింది. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... పరిగి, నస్కల్ ప్రాంతానికి చెందిన సాజొద్దీన్ కుటుంబం కొన్నేండ్లుగా హఫీజ్‌పేట్ సాయినగర్‌లో నివాసముంటున్నారు. ప్లాస్టిక్ వస్తువుల దుకాణం నిర్వహించే సాజొద్దీన్‌కు భార్య షాజియాబేగం (27)తో పాటు ముగ్గురు కుమారులున్నారు. సోమవారం మధ్యా హ్నం నుంచి షాజియా కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

రాత్రి షాజియా మృతదేహం ఇంట్లోని సంపులోనే లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటి వారు అర్ధరాత్రివేళ సాజొద్దీన్ ఇంటిపైకి దాడికి దిగారు. తమ బిడ్డను హత్యచేసి సంపులో పడేశారంటూ ఆగ్రహంతో దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. స్థానికులు వారిని ప్రతిఘటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇరుపక్షాలను అడ్డుకున్నారు. సాజొద్దీన్ సహా పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

ఫోన్, ట్విట్ట‌ర్ హ్యాక్ అయిందంటున్న హ‌న్సిక‌

Thu,January 24, 2019 08:48 AM

hansika phone and twitter hacked

బొద్దుగుమ్మ హ‌న్సిక ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్‌ని అందుకొని ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌తో బిజీ అయింది. ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు 49 సినిమాలు పూర్తి చేసిన హ‌న్సిక త్వ‌ర‌లో త‌న 50వ చిత్రం మ‌హాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నూతన దర్శకుడు జమీల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో జరిగే కథ ఇది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హ‌న్సిక త‌న సినిమా విశేషాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని కూడా షేర్ చేస్తుంటుంది. ఈ మ‌ధ్య హ‌న్సికకి సంబంధించిన హాట్ పిక్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ షాక్‌కి గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో హ‌న్సిక త‌న ట్విట్ట‌ర్ లో నా ఫోన్ మ‌రియు ట్విట్ట‌ర్ హ్యాక్ అయింది. ఏ మెసేజ్‌కి మీరు స్పందించ‌వద్దు. నా బ్యాక్ ఎండ్ టీం దీనిపై విచార‌ణ జ‌రిపి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అనే కామెంట్ పెట్టింది. హ‌న్సిక ఇటీవ‌ల తెలుగులో క‌థానాయకుడు చిత్రంలో జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో మెరిసిన విష‌యం విదిత‌మే.


ముగ్గురు హీరోల‌తో ఎఫ్3 ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి

Thu,January 24, 2019 08:22 AM

three heroes in f3

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఎఫ్ 2 అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాగా, ఇప్ప‌టికి కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలోని కామెడీకి ప్రేక్ష‌కులు పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్నారు. అయితే ఈ చిత్రం ఇంత హిట్ కావ‌డంతో మూవీకి కొన‌సాగింపుగా ఎఫ్ 3 అనే చిత్రాన్ని చేయాల‌ని అనీల్ రావిపూడి భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ముగ్గురు హీరోల‌తో చేయాల‌ని అనీల్ రావిపూడి అనుకుంటున్నాడ‌ట‌.

ఎఫ్ 3 చిత్రంలో వెంకీ, వ‌రుణ్ తేజ్‌ల‌తో పాటు ర‌వితేజ‌ని కూడా తీసుకోవాల‌ని అనీల్ రావిపూడి భావిస్తున్నాడ‌ట‌. ఆ మ‌ధ్య ర‌వితేజ‌తో క‌లిసి అనీల్ రావిపూడి రాజా ది గ్రేట్ అనే చిత్రం చేయ‌గా ఈ మూవీ పెద్ద విజ‌యం సాధించింది. ఇందులో ర‌వితేజ కామెడీ టైమింగ్ కూడా అదిరింది.ఈ నేప‌థ్యంలో ముగ్గురు హీరోల‌తో చేస్తే సినిమా బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనుకుంటున్నాడ‌ట‌. అయితే ఎఫ్ 3 చిత్రాన్ని ఎఫ్‌2 సీక్వెల్‌గా మాత్రమే కాకుండా.. ‘రాజా ది గ్రేట్’ మూవీకి కొనసాగింపుగా కూడా కథను రెడీ చేస్తున్నారట అనీల్ రావిపూడి. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడిగా క‌నిపించిన ర‌వితేజ ఎఫ్‌3లోను అంధుడిగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది

నేనెల్త బిడ్డో సర్కారు దవాఖానకు...

Thu,January 24, 2019 08:01 AM

public health centers development in telangana

హైదరాబాద్ : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఒకప్పటి మాట.. తెలంగాణ ఏర్పాటు తర్వాత నేనెల్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారు పేదలు. ఉస్మానియా దవాఖానలో ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో ఓపీ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 2018లో ఈ సంఖ్య 9 లక్షల 56 వేల 123కు చేరుకున్నది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. నూతనంగా మరో 5 ఫార్మ సీ కౌంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు.

ఉస్మానియా దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. 2014లో 5 లక్షల 6 వేల 994గా ఉన్న ఓపీ సంఖ్య 2018లో 9 లక్షల 56 వేల 123కు చేరుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దవాఖానను సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. నిత్యం దవాఖానకు సుమారు 3000 మంది ఓపీకి వస్తుంటారు. వీరిలో వంద నుంచి రెండు వందల మంది ఇన్ పేషెంట్లుగా చేరుతుండగా మిగిలిన వారు ఔట్ పేషెంట్ విభాగంలో వైద్యం చేయించుకొని వెళ్తారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య పరికరాలు, డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. 8 ఫార్మసీ కౌంటర్లు ఉండగా ఇటీవల మరొకటి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఓపీ పెరుగడంతో మరో 5 కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరో 5 ఫార్మసీ కౌంటర్లు..

ఉస్మానియా దవాఖానలో మరో 5 నూతన ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు దవాఖాన పాలక వర్గం కృషి చేస్తున్నది. గతంలో కంటే సుమారు 4 లక్షల వరకు ఓపీ పెరగడంతో దీన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. 2014లో 8 ఫార్మసీ కౌంటర్లు కొనసాగేవి. 2018లో 9 లక్షల 56 వేల 123 మంది ఓపీలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వస్తుండటంతో మరో 5 ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు చేయాలని డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు.

2014లో అత్యల్పం... 2018లో అత్యధికం

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉస్మానియా దవాఖానకు నిధులను భారీగా కేటాయించడంతో ఓపీకి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. 2014లో 5 లక్షల 6వేల 994 గా ఉన్న సంఖ్య 2015లో 5 లక్షల 60 వేలకు, 2016లో 6 లక్షల 20 వేలకు, 2017లో 7లక్షల 27 వేల 937కు, 2018లో 9 లక్షల 56 వేల 123కు చేరింది. 2014లో దవాఖానలో 45 వేల అడ్మిషన్లు జరుగగా, 52 వేల మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించారు. 2018లో 47 వేల 651 అడ్మిషన్లు జరుగగా, 61 వేల 568 మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించారు. దవాఖానలో 2018 వరకు 694 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. దవాఖాన నెఫ్రాలజీ డయాలసిస్ కేంద్రంలో 325 డయాలసిస్ చికిత్సలను విజయవంతంగా నిర్వహించగా, ఉస్మానియా డీమాట్ డయాలసిస్ కేంద్రంలో 14 చికిత్సలు చేశారు. ఉస్మానియా దవాఖానలో మొత్తంగా ప్రతి నెలా 1700 నుంచి 1800 మందికి డయాలసిస్‌ను నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

స్టంట్లు చేయడం కోసం బైక్ దొంగతనాలు...

Thu,January 24, 2019 07:35 AM

Bike robberies for stunts in hyderabad

హైదరాబాద్ : బైక్ చోరీలతో పాటు స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు మైనర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగారంలోని సిద్దార్థ నగర్‌కు చెందిన బాలుడు(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు, తండ్రి చనిపోవడంతో తల్లి కష్టపడి అతనిని చదివిస్తున్నది. ఇతడికి ద్విచక్రవాహనాలపై స్టంట్స్ చేయడం సరదా, కేబీఆర్ పార్కు, ఉప్పల్ ప్రాంతాలలో సెలవు రోజులలో బైక్స్‌పై స్టంట్స్ చేస్తూ, యువతకు శిక్షణ కూడా ఇస్తుంటాడు. ఈ క్రమంలో తమ ప్రాంతంలో నివసించే ముగ్గురు మైనర్లు స్నేహితులుగా మారారు.

స్టంట్స్ చేసేందుకు తమకంటూ సొంత బైక్‌లుండాలని వీళ్లంతా కలిసి గోల్కొండ, జుబ్లీహిల్స్ ప్రాంతాలలో మూడు బైక్‌లు చోరీ చేసి వాటికి నకిలీ నెంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నారు. దీంతో పాటు గోపాలపురం, మహంకాళి, ఎల్బీనగర్ ప్రాంతంలలో నడుచుకుంటూ వెళ్లే వారి చేతిలో నుంచి సెల్‌ఫోన్లు లాక్కొని పరారవుతున్నారు. ఇటీవల గోపాలపురం ఠాణా పరిధిలోని క్లాక్‌టవర్ వద్ద ఒక సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడడంతో కేసు నమోదయ్యింది. దీనిపై విచారణ చేస్తుండగా ఈ ముఠా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది. ఈ మేరకు నలుగురిని అదుపులోకి తీసుకొని గోపాలపురం పోలీసులకు తదుపరి విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు.

నైపుణ్య శిక్షణకు మొబిలైజేషన్ క్యాంపులు

Thu,January 24, 2019 06:59 AM

Mobilization camps for skill training in hyderabad

హైదరాబాద్ : నైపుణ్యశిక్షణా కార్యక్రమాల అమలులో జోరు పెంచిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అభ్యర్థులు, శిక్షణా సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చి నచ్చిన కోర్సులో అక్కడిక్కడే అడ్మిషన్లు పొందేలా మొబిలైజేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా.. అధికారులు, శిక్షణాసంస్థలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్కడే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అభ్యర్థుల అభిరుచుల మేరకు అక్కడిక్కడే ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మూడు, నాలుగు నియోజకవర్గాలు కలిపి ఒకే చోట క్యాంపులను నిర్వహించి, శిక్షణ తీసుకునే వారిని ఎంపిక చేయనున్నారు. ఇలా జిల్లాలో 4 ప్రాంతాల్లో మొబిలైజేషన్ క్యాంపులను నిర్వహించబోతున్నారు. ఇందుకోసం షెడ్యూల్‌ను ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఖరారుచేశారు. వాస్తవికంగా ఈ నెల 7, 8, 9, 10 తేదీల్లో పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. కాని అనివార్య కారణాలతో వీటిని వాయిదా వేయగా, తాజాగా నూతన షెడ్యూల్‌ను ఖరారుచేశారు. ఇది వరకు 15 సంస్థల్లోనే శిక్షణ అందుబాటులో ఉండగా, తాజాగా మరో రెండు సంస్థలు కొత్తగా చేరాయి. ఇక కోర్సుల సంఖ్య ఇది వరకు 68 ఉండగా, తాజాగా మరో 9 పెరిగి 77కు చేరుకోవడం గమనార్హం.


ఫిబ్రవరి 1న నైపుణ్య శిక్షణా సంస్థల ఎంపిక

అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణనిచ్చేందుకు ఫిబ్రవరి 1న శిక్షణా సంస్థల ఎంపికను చేపట్టనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహ్మద్ ఖాసీం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక ప్రక్రియను ఫిబ్రవరి 1న జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో చేపట్టనున్నామని తెలిపారు. ఆసక్తి గల శిక్షణా సంస్థలు వారి యొక్క వివరాలు, వారందించే శిక్షణ, వారి వద్ద గల సౌకర్యాలు, ఫీజుల వివరాలతో ఎంపికకు హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాల కోసం 040 -23240134 నంబర్‌ను, హజ్‌హౌజ్ 6వ అంతస్తులోని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య విధానంలో బీఈడీ అడ్మిషన్

Thu,January 24, 2019 06:50 AM

Osmania University Distance Education B.Ed Admission 2019

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య విధానంలో 2018-19 విద్యా సంవత్సరానికి బీఈడీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబా ద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పది స్టడీ సెంటర్లలో ఒక్కో కేంద్రానికి 50 సీట్ల చొప్పున మొత్తం 500 సీట్లను కేటాయించనున్నారు. దూరవిద్య బీఈడీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో 110 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు.. ముందుగా www.oucde.net లో ఫిబ్రవరి 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.200 ఆలస్యరుసుంతో ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేంద్రాల్లోని రోస్టర్ ఆధారంగా ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

దూరవిద్య విధానంలో బీఈడీ సీట్లకు సంబంధించి ఉన్న మెథడాలజీల ప్రకా రం కోటాను నిర్దేశించారు. సాధారణంగా దూరవిద్య విధానంలో ఏ కోర్సు చదువాలనుకున్నా.. దేశంలోని ఏ ప్రాంతంవారైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ, ఒక్క దూరవిద్య బీఈడీ లో మాత్రం తెలంగాణలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకే అవకాశం ఉంది. 2014 వరకు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో దూరవిద్య బీఈడీ కొనసాగింది. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో బీఈడీని ఎన్సీటీఈ రద్దు చేసింది. దూరవిద్య విధానం ఆధ్వర్యంలోనే దూరవిద్య కోర్సులను నిర్వహించాలని తేల్చిచెప్పింది. ఓయూ దూరవిద్య విభాగం డైరెక్టర్ చింతా గణేశ్ పత్య్రేక ఆసక్తితో ఎన్సీటీఈ అధికారులను వర్సిటీకి రప్పించి.. తీవ్ర ప్రయత్నాల అనంతరం తిరిగి 2018-19లో దూరవిద్యలో బీఈడీని ప్రవేశపెట్టేందుకు అనుమతినిచ్చింది.

నేడు మైక్రోశాట్ ఆర్, కలాంశాట్ ఉపగ్రహాల ప్రయోగం

Thu,January 24, 2019 06:38 AM

ISRO Launch Countdown for Microsat R and Kalamsat Satellites Starts Today

చెన్నై : పీఎస్‌ఎల్వీ సీ44 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ రోజు రాత్రి 11.37 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిన్న రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 28 గంటల పాటు కొనసాగిన అనంతరం నేటి రాత్రి 11.37 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ44 నింగిలోకి దూసుకెళ్లనుంది. భారత రక్షణ, పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో)కు సంబంధించిన ఇమేజింగ్ శాటిలైట్ మైక్రోశాట్ ఆర్‌తోపాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన కలాంశాట్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ44 ద్వారా ఇస్రో నింగిలోకి పంపుతున్నది.

ప్రయోగించిన 13 నిమిషాల అనంతరం 277 కిలోమీటర్ల ఎత్తులో మైక్రోశాట్ ఆర్ ఉపగ్రహం వాహకనౌక నుంచి వేరుపడనుంది. పీఎస్‌ఎల్వీ సీ 44 ప్రయోగంలో బరువును తగ్గించి, పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి నాలుగోదశలో అల్యూమినియం ట్యాంక్‌ను వినియోగిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని నాలుగు దశల్లో చేపట్టనున్నారు. సాధారణంగా పీఎస్‌ఎల్వీ మొదటి దశలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగిస్తారు. కానీ పీఎస్‌ఎల్వీ సీ44లో కేవలం రెండు స్ట్రాపాన్ బూస్టర్లనే వాడారు. దీంతో దీన్ని పీఎస్‌ఎల్వీ- డీఎల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ఉపయోగిస్తుండడం ఇదే తొలిసారి. వాహకనౌకలోని పీఎస్4(నాలుగో దశ) దశను పలు పరిశోధనలకు పునర్వినియోగించుకునేలా దాన్ని అంతరిక్షలోనే ఉంచనున్నారు. కలాంశాట్ మొట్టమొదటిగా పీఎస్4 దశను వినియోగించుకోనుంది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు!

Thu,January 24, 2019 06:17 AM

rain falling possibility effect of the surface trough!

హైదరాబాద్ : ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాగల 36 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చన్నారు. ఉత్తర భారతదేశం నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి పెరిగొచ్చని చెప్పారు.

గ్రేటర్‌పై మరో రెండురోజులు పొగమంచు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. రెండురోజులపాటు పొడి వాతావరణం, పొగమంచు ఏర్పడొచ్చని పేర్కొన్నది. మరోవైపు బుధవారం నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.4 డిగ్రీలు పెరిగి 31.4 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.9 డిగ్రీలు పెరిగి 17.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని అధికారులు తెలిపారు.

నేటి నుంచి సూర్యాపేట జాన్‌పహాడ్ ఉర్సు

Thu,January 24, 2019 06:12 AM

Suryapet Janpahad Saidulu Dargah URUS

పాలకవీడు: నాలుగువందల ఏండ్ల చరి త్ర కలిగి, హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్ ఉర్సు ఈ రోజు నుంచి ప్రా రంభం కానున్నది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపహాడ్‌లో 24, 25, 26 తేదీల్లో నిర్వహించే వేడుకకు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. నిర్వహణకు ప్రభుత్వం రూ.6.50 లక్షలు కేటాయించింది. గురువారం తెల్లవారుజామున నమాజ్ రసూల్ షరీఫ్ కార్యక్రమంతో ఉర్సు ప్రారంభం అవుతుంది. శుక్రవారం గంధం ఊరేగింపు జరుగనుంది. శనివారం ప్రత్యేక దీపారాధనతో ఉత్సవం ముగుస్తుంది. ఈ ఉర్సుకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర తదితర ప్రాంతాల నుంచి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా.

ఈ నెల 25న స్కిన్ సఫరత్ రథయాత్ర

Thu,January 24, 2019 06:04 AM

Skin Safar Yatra Department of Dermatology Skin Health Awareness Program

గాంధీ దవాఖాన : చర్మ సౌందర్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతను ఇస్తారని అలాంటి చర్మాన్ని రక్షించుకునేందుకు తగిన సలహాలు, సూచనలు చర్మ వైద్యుల వద్ద పొందాలని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ అన్నారు. గాంధీ దవాఖాన డెర్మటాలజీ విభాగంలో జరిగిన చర్మవ్యాధుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చర్మవ్యాధులు కలిగిన వ్యక్తులను సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. అలాగే ప్రజల్లో ఉన్న అనుమానాలను రూపుమాపేందుకు సొరియాసిస్, తెల్లమచ్చలు ఇలా ఎలాంటి వ్యాధులకైనా చికిత్స ఉంటుందని, ఆ జబ్బులు కలిగిన ప్రజలు వైద్యులను సంప్రదించేందుకు మొహమాటపడటం మంచిది కాదన్నారు. చర్మవ్యాధులు కలిగిన వ్యక్తులు నేరుగా చర్మవ్యాధి వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స పొందితే ఎలాంటి ఇబ్బందులుండవని తెలిపారు.

అనంతరం ఈ నెల 25వ తేదీన స్కిన్ సఫరత్ రథయాత్ర ఢిల్లీ నుండి బయలు దేరి గాంధీ దవాఖానకు వస్తుందని అన్నారు. ఈ రథయాత్ర 18 రాష్ట్రాలను కలియతిరుగుతూ 60 రోజుల పాటు 12వేల కిలోమీటర్ల పొడవునా పలు ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందన్నారు. ఈ రథయాత్రలో చర్మవ్యాధులపై అవగాహన కలిగించే చిత్రాలతో పాటు చర్మవ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో ఉండే స్క్రీన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో డీవీయల్ విభాగం హెచ్‌ఓడీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహరావు నేత, డాక్టర్స్ భూమేశ్‌కుమార్, రామ్మోహన్, కవిత, పద్మ, నాగశ్వేత, షాహానా, రాకేశ్, సంగీత తదితరులు పాల్గొన్నారు.

24 జనవరి 2019 గురువారం మీ రాశి ఫలాలు

Thu,January 24, 2019 05:57 AM

24th january 2019  Thursday horoscopes details

మేషం

మేషం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు.

వృషభం

వృషభం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

మిథునం

మిథునం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

సింహం

సింహం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

కన్య

కన్య : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

తుల

తుల : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు.

వృశ్చికం

వృశ్చికం : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

మకరం

మకరం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మూత్ర సంబంధ సమస్యలు కాని, చర్మ సంబంధ ఆరోగ్య సమస్యలతో కానీ బాధపడే అవకాశమున్నది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎక్కువ ఆవేశానికి కాని, అసహనానికి కాని లోనవకండి. పనులు వాయిదా పడినా, పట్టుదల వీడకుండా ప్రయత్నం చేయటం మంచిది.

కుంభం

కుంభం : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం.

మీనం

మీనం : ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు.

NATIONAL - INTERNATIONAL

SPORTS

TECHNOLOGY

Featured Articles

Health Articles