గురువారం 03 డిసెంబర్ 2020
Business - Oct 21, 2020 , 18:58:27

ఐకియా ఇండియ‌లో జూప‌ర్ సీసీప్యాక్‌!

ఐకియా ఇండియ‌లో జూప‌ర్ సీసీప్యాక్‌!

హైద‌రాబాద్‌: ఇంటెలిజెంట్ వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం అయిన జూపర్.. ఐకియా ఇండియాలో తన కోవిడ్ -19 కంప్లియ‌న్స్‌ ప్యాక్ (ZuperCCPack)ను అమల్లోకి తేనున్న‌ది. ఐకియా ఇండియాలో సాధారణ వ్యాపార కార్యకలాపాలు కొన‌సాగుతున్న‌ప్ప‌డు క‌స్ట‌మ‌ర్లు, ఉద్యోగులు, ఇత‌రుల ర‌క్ష‌ణ కోసం భద్రతా ప్రమాణాలు నిర్వహించ‌డంలో జూప‌ర్ ప్యాక్ సాయ‌ప‌డ‌నున్న‌ది. హైద‌రాబాద్, ముంబై, పుణెల్లో త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించిన ఐకియా ఇండియా సంస్థ‌లో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టడానికి జూప‌ర్ సీసీ ప్యాక్ చ‌క్క‌ని ప‌రిష్కారం కానుంది.

క‌స్ట‌మ‌ర్ల‌కు సాధ్యమైనంత ఉత్తమ సేవ‌లు అంద‌జేయం చాలా ముఖ్యం. సరికొత్త రీతిలో ప్రజారోగ్య మార్గదర్శకాలు, నిబంధనలు పాటించ‌డానికి ZuperCCPack తోడ్ప‌డ‌నున్న‌దని ఐకియా ఇండియా బిజినెస్ మేనేజ‌ర్ సంతోష్ స‌యారీ చెప్పారు. ఐకియా ఇండియాలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంప్లియ‌న్స్ ప్యాక్ ఉప‌యోగాల‌ను ఇత‌ల సంస్థ‌లు కూడా గుర్తిస్తాయ‌ని తాము ఆశిస్తున్నామ‌ని జూప‌ర్ సీఈవో ఆనంద్ సుబ్బ‌రాజ్ పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.